వెనక పెద్ద పులి ముందు పెద్ద లోయ.. సూపర్ డీలక్స్ ట్రైలర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఒక వ్యక్తి ఒక ఎత్తైన కొండ పై నడుస్తూ వెళుతుంటే అతనిని చూసిన ఒక పెద్ద పులి అతని వెంట పడుతుంటే కొండ అంచుకొచ్చేశాక.. ముందు పెద్ద లోయ వెనక పెద్ద పులి.. అంటూ మొదలయ్యింది సూపర్ డీలక్స్ ట్రైలర్..! ఈ సినిమా తమిళం లో తెరకెక్కుతుంది. తమిళ హీరో విజయ్ సేతుపతి, సమంత, రమ్యా కృష్ణ ముఖ్యపాత్రల్లో కనిపిస్తున్నారు. అయితే విజయ్ సేతుపతి ఒక ఆడ వేషం లో కనిపించనున్నాడు.. ఇక సమంతా హీరోయిన్  కాగా రమ్యా కృష్ణ ఒక వేశ్య లాగా ఒక పోర్న్ స్టార్ లాగా కనిపించనుంది. ట్రైలర్ కన్నా ట్రైలర్ లో వెనకాల వస్తున్న విజయ్ సేతుపతి వాయిస్ విజయ్ చెబుతున్నా కథ భావోద్వేగానికి గురి చేస్తుంది.. ఇక ట్రైలర్ విషయానికొస్తే ఈ సినిమా ఏదో కొత్త విదంగా చూప్శితున్నారని అర్ధం అవుతుంది..ట్రైలర్ లో కనిపించే ప్రతి పాత్ర లో టెన్షన్ కనిపిస్తుంది.

సమంతా కనిపించిన ప్రతీ సీన్లో టెన్షన్ పడుతూ తొందర పడుతూ ఉంది.. ఒక పోలీస్ స్టేషన్ లో ఏడుస్తూ కనిపించింది.. ఇక మరో సన్నివేశం లో మట్టన్ కత్తి తో ఏదో బాడుతుంది. ఇక రమ్యా కృష్ణ కూడా ఒక సీన్ లో టెన్షన్ కి గురయినప్పటికీ మిగితా సన్నివేశాలు చూస్తుంటే సినిమాలో తనది చాలా ఇంపార్టెంట్ రోల్ అని అర్ధం అవుతుంది. ఇక విజయ్ సేతుపతి సినిమా మొదటి నుండి చివరి వరకు కనిపించబోతున్నాడని కథని తానే మారుస్తాడని అనిపిస్తుంది. ఇక ఈ సినిమా లో ఒక గ్యాంగ్ స్టర్ మరో నలుగురు కుర్రాళ్ళు కనిపిస్తున్నారు.. ట్రైలర్ ప్రకారం సినిమా ఈ నలుగురు కురాళ్లతో స్టార్ట్ అవుతుంది.. వాళ్ళు చేసే ఏదో ఆకతాయి పనితో కథ మొదలవుతుంది అని అనిపిస్తుంది. ఏదేమైనా సినిమా ట్రైలర్ మాత్రం చాలా త్రిల్లింగ్ గా ఉంది అని చెప్పొచ్చు.. ఇక ఈ సినిమా కి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ని ఇచ్చి చిత్రా బృందానికి షాక్ ఇచ్చింది. ఏ సర్టిఫికేట్ ఇచ్చిందంటే దానికి తగ్గ సన్నివేశాలే ఉన్నాయని చెప్పొచ్చు ఇక ఈ సినిమా దర్శకుడు త్యాగ‌రాజ‌న్ సినిమా కథ పై ట్రైలర్స్ కి సాంగ్స్ కి వస్తున్న రెస్పాన్స్ తో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమా లోని కథని మీరు ఎక్కడా చూసుందరని ఆయన సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా 29 న రిలీజ్ కానుంది. ఇక సినిమా ఎలా ఉండబోతుందో తెలుస్కోవాలంటే వేచి చూడాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: