ప్రభాస్ ప్రస్తుతం సహూ సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమాలో నటిస్తూనే మరో సినిమాకి ఒకే చెప్పేశాడు. జిల్ సినిమా దర్శకుడు రాధాకృష్ణతో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో ఫ్రాభాస్ డ్యూయల్ రోల్ చేయనున్నాడట. 1960-70 నాటి ప్రేమ కథ ఒక వైపు ప్రస్తుత కాలం ప్రేమ కథ మరో వైపు. అయితే ప్రభాస్ సరసన పూజా హెగ్డే కాజల్ అగర్వాల్ లు నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా షూటింగ్ అప్పుడే ఇటలీ లో ప్రారంభం అయిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ పూజ హెగ్డే తో జరిగే సన్నివేశాల్లో నటిస్తున్నాడట. ఇక ఆపాత్ర లో ప్రభాస్ కార్ల వ్యాపారిగా మంచి లవర్ గా కనిపించనున్నారు. ఇక పోతే ప్రస్తుత రోల్ లో ప్రభాస్ ప్లే బాయ్ పాత్ర లో కనిపిస్తారు. ఇక ఈ సినిమాకి టైటిల్స్ లో ఒకటిగా జాన్ అనే పేరుని పరిశీలిస్తున్నారు. ఇక మరికొన్ని అప్డేట్స్ త్వరలో బయటకి రానున్నాయి.