ఏదో కుట్ర పన్నారు..వ్యూహాత్మకంగానే అధికారుల బదిలీ-బాబు

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుని డైరెక్ట్ గా ఎదుర్కునే దైర్యం లేక ప్రతిపక్షాలు అన్నీ కలిసీ ఐపీఎస్ అధికారులని బదిలీ చేశారని ఆయన భద్రతని పర్యవేక్షించే ఎస్పీలని కూడా బదిలీ చేశారని ఆయన ఆరోపించారు బుధవారం ఆయన అమరావటై లో టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. మోడి జగన్ లపై ఆయన మండిపడ్డారు నేతలనీ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఇక తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్ పై కూడా ఆయన స్పందించారు.

ఆయన మాట్లాడుతూ.. అసలు ఎన్నికలతో ఇంటెలిజెన్స్ కి ఏంటి సంబంధం..? ఎన్నికలకీ నా భద్రత పర్యవేక్షించే అధికారులకి అసలు సంబంధమే లేదు.. అయినా కూడా అధికారులని బదిలీ చేశారు.. ఏ కారణం తో నా అధికారులని బదిలీ చేశారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దీని వెనుక ఏదో పెద్ద కుట్రనే ఉందని ఏదో వ్యూహాత్మకంగానే అధికారులని మార్చారంటూ ఆయన ఆరోపణలు చేశారు.

ఎవ్వరెన్ని కుట్రలు చేసినా తెలుగు తమ్ములు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ వైపు ఉన్నంత వరకు తమకి ఏమి జరగదని ఎవరి కుట్రలు సాగవని ఆయన ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో ప్రత్యర్థులు ఇంకా ఎన్నో కుట్రలు చేసే అవకాశం ఉన్నందున దేన్నైనా గట్టిగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. మోదీ మళ్ళీ అభద్రతా వాతావరణాన్ని నెలకొల్పుతారని మైనారిటీలెవ్వరు బయటకి రాకుండా చేస్తారని గోద్రా లాంటి ఘటనలు పునరావృతం అయ్యే సూచనలు ఉన్నాయని ప్రజలని ఆయన హెచ్చరించారు.

ఇక తెలంగాణ ప్రభుత్వం గురించి ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పోలవరాన్ని ఆపాలని ఎన్నో కుట్రలు పన్నుతున్నారని ఆయన అన్నారు. పోలవరాన్ని ఆపాలని వాళ్ళు చేస్తున్న కుట్రలు నీచమని వారి చర్య నీచమైన చర్య అని బాబు అభివర్ణించారు. ఇక తెలంగాణ లో నేడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి కాగా టీఆర్‌ఎస్ కి ఈసారి మొండి చేయి లభించింది. మూడు చోట్ల ఓటమి పాలయ్యింది.. ఇక ఈ విషయం పై బాబు స్పందిస్తూ..టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి తమ పై తమకి అతి విశ్వాసం ఉందని ఆ అతి విశ్వాసంతోనే టీఆర్ఎస్ ఓడిపోయిందని వ్యాఖ్యానించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: