మిషన్ శక్తి ముందు తరాలకి ఒక ఆయుధం-మోదీ

Google+ Pinterest LinkedIn Tumblr +

భారత్ రక్షణ రంగం లో మరొక మెట్టు ఎక్కిందానే చెప్పొచ్చు. భద్రత రంగంలో తారా స్థాయికి ఎదిగిపోయింది. నేడు భారత్ అంతరిక్షంలో చరిత్రని సృష్టించింది. అంతరిక్షంలో మన శాస్త్రవేత్తలు ఒక శ్యాటిలైట్ ని మిసైల్ ఉపయోగించి పడగొట్టారు. మన శాస్త్రవేత్తలకి ఆ శ్యాటిలైట్ ని పడగొట్టడానికి కేవలం 3 నిమిశాలే పట్టింది. ఇప్పటి వరకు ఇలా అంతరిక్షంలో శాటిలైట్ ని పడగొట్టిన దేశాలు మూడే మూడు.. ఇక పై భారత్ కూడా ఆ లిస్ట్ లో చెరీ ఆ సంఖ్యని 4 చేసింది. మోదీ ఈ మిషన్ కి మిషన్ శక్తి అనే పేరుని పెట్టారు. మోదీ ఈ విజయాన్ని తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఈ ప్రయోగం చేసి విజయవంతమైన దేశాల్లో అమెరికా రష్యా చైనా ఉండగా ఇక పై భారత్ కూడా ఈ లిస్ట్ లో చేరింది. ఇది నిజంగానే చారిత్రాత్మక విజయం. ఈ ప్రయోగం విజయవంతం అయినందుకు భారత్ అంతరిక్ష పరమ్గా కూడా యుద్ధం చేయడానికి సిద్ధం అయ్యిందనే చెప్పాలి.

భారత అంతరిక్ష సంస్థ అత్యంత కీలకంగా చేపట్టిన ఈ ఆపరేషన్ పేరు మిషన్ శక్తి అని ప్రధాని తెలిపారు. ఇది భారత్ కి ఎంతో గర్వకారణం.. ఈ మిషన్ శక్తి రాబోయే తరాలకి ఒక ఆయుధం గా మారాబోతుందని అని ఆయన అన్నారు. భారత్ కి 3000 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ శాటిలైట్ ని భారత్ కూల్చేయడం ఎంతో గర్వకారణం ప్రతి ఒక్క శాస్త్రవేత్త ఈ మిషన్ కై ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా డీ‌ఆర్‌డీవో శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషించి ఈ మిషన్ విజయం లో ముఖ్య పాత్రులయ్యారు. ఈ ప్రాజెక్ట్ కి పని చేసిన ప్రతీ ఒక్కరి కృషి అభినందనీయం అందరికీ నా ప్రత్యేఖ అభినందనలు మరియు శుభాకాంక్షలు అంటూ ఆయన వెల్లడించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: