బాబు మంత్రం వేశారు..! ఎస్పీవై మెత్తగాయ్యారు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నంద్యాల జనసేన లోక్‌సభ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి కొన్ని రోజుల క్రితమే జనసేన లోకి చేరిన విషయం తెలిసిందే. అయితే ఈయన గత మూడు సార్లు టీడీపీ తరఫున పోటీ చేసి ఎంపీ గా గెలిచారు ఇక ఈసారి ఎన్నికలకీ ముందు కొద్ది రోజులుగా ఈయన ఆరోగ్యం సరిగ్గా లేకపోయావడం వల్ల ఈయన పార్టీ కి కొంత దూరంగా ఉన్నారు. ఇక టికెట్ ల సబ్బుబాటు సమయం లో కూడా ఈయన బాబు ని కలవలేదు. ఇక బాబు ఈయన యాక్టివ్ గా లేరని ఈయన వైపు మొగ్గు చూపించలేదు. దాంతో ఈయన టీడీపీ అభ్యర్థిత్వానికి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా ఇస్సారి బరిలోకి దిగాలని నిశ్చయించుకున్నారు. ఇక ఈ విషయం తెలిసిన జనసేనాని ఈయన తో మంతనాలు చేసి ఈయనని పార్టీ లోకి ఆహ్వానించారు.

పవన్ ఆహ్వానం మేరకు ఈయన పార్టీ లోకి వచ్చారు పార్టీ లోకి ఈయనని పవన్ సాదరంగా ఆహ్వానించడమే కాకుండా ఈయనకి జనసేన తరఫున నంద్యాల ఎంపీ టికెట్ ఇచ్చారు ఆమ్టే కాకుండా ఈయన కుటుంబానికి మరో రెండు టికెట్ లు కూడా ఆఫర్ చేశారు. ఈయన చిన్న కుమార్తె అరవిందరాణికి బనగానపల్లి అసెంబ్లీ టికెట్ ను, పెద్ద అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డికి నంద్యాల అసెంబ్లీ టికెట్ ను ప్రకటించారు. ఇక మొన్నటితో నామినేషన్ల చివరి గడువు కావడంతో ఎస్పీవై రెడ్డి ఆయన కూతురు ఆయన అల్లుడు అందరూ నామినేషనలు వేశారు. ఇక ఈ కుటుంబం రాక తో పవన్ కూడా నంద్యాల నుండి ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అంతా బానే ఉందనుకున్నప్పటికి పవన్ కి మరో చిక్కు వచ్చి పడింది.

జనసేన పార్టీ కి ఎస్పీవై రెడ్డి రాజీనామా చేయబోతున్నారని ఆయనే కాకుండా ఆయన కూతురు అల్లుడు కూడా రాజీనామా చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారంలో భాగంగా నంద్యాల చేరాడు అక్కడికి చేరుకున్న ఆయన ప్రసంగించారు ఆయనమాట్లాడుతూ ఎస్పీవై కుటుంబం చేసిన కృషిని నేను ఎప్పుడు మరువనని వారికి తగిన కితాబు ఇస్తానని ఆయన అన్నారు. జనసేన ని వీడి ఆయనను మళ్ళీ టీడీపీ లోకి రమ్మని ఆహ్వానించారు టీడీపీ లోకి వస్తే ఆయనకి ఎమ్మెల్సీ పదవి కూడా ఇస్తానని బాబు హామీ ఇచ్చారు. ఇక బాబు మాటలతో ఎస్పీవై రెడ్డి కాస్త కూల్ అయ్యారని మనసు మార్చుకునేలా కనిపిస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇక ఆయన పార్టీని వీడితే జనసేన నంద్యాల ఆశలు వాదులుకోవాల్సిందే..! అంతే కాకుండా ఆయన వెళ్లిపోతే ఆయనతో పాటు ఆయన కూతురు ఆయన అల్లుడు కూడా పార్టీని విడుతారు. ఇది పవన్ కి నిజంగానే కష్టం గా మారుతుంది. ఆయన విడుటారేమో అనే సందేహాలు వినపడుతున్నాయి కానీ దీని పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

chandrababu invited spy reddy to tdp

Share.

Comments are closed.

%d bloggers like this: