నేను యాక్టరే.. నీవు..? నీవేమైనా మహాత్మాగాంధివా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

వైసీపీ అధినేత జగన్ జనసేన అధినేత పవన్ ఒకరి పై ఒకరు సెటైర్లు వేసుకుంటూనే ఉన్నారు. ప్రచారాలు నిర్వహిస్తున్నారు ప్రచారల్లో సెటర్లు వేసుకుంటున్నారు. చేసేది చెప్పేది తక్కువ ఒకరిపై ఒకరు విమర్శలు ఎక్కువ.. అన్నట్టుగా ఉంది విరీ వైఖరి. వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ పవన్ ని విమర్శిస్తున్నారు. పవన్ ఒక యాక్టర్ అని పవన్ చదివింది ఏంటని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ విమర్శలపై పవన్ స్పందించారు.

ప్రకాశం జిల్లా మార్కాపురం లో పవన్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు అక్కడ ఆయన వైసీపీ నేతల వ్యాఖ్యాలకి జగన్ విమర్శలకి ధీటుగా సమాధానం చెప్పారు. జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. “జగన్ మాట్లాడితే, నన్ను ‘యాక్టర్’ అంటారు. నేను కాదనడం లేదు. మరి, రెండు సంవత్సరాలు జైల్లో ఉండొచ్చిన మీరు మహాత్మాగాంధీయా? మీరు ఏం చేశారు?” అని ప్రశ్నించారు.

నన్ను మాటిమాటికీ చంద్రబాబు పర్ట్నర్ అంటున్నారు.. అసలు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరి పార్టనర్ అనాలి? మోదీ పార్టనరా? అమిత్ షా పార్టనరా? టీఆర్ఎస్ పార్టనరా?” అని ప్రశ్నించారు. “ఈ ముగ్గురితో పార్టనర్ అయిన జగన్ మోహన్ రెడ్డికి నేనొకటి చెబుతున్నా, నేను యాక్టర్ నే. అది వదిలేసి రాజకీయాల్లోకి వచ్చాను. నేను చదువుకుంది పదో తరగతే. కానీ, నా చదువు ఆపలేదు సమాజం గురించి వారికి ఎలా అభివృద్ది చేయాలో అనే విషయాలు ఇంకా చదువుతూనే ఉన్నా..! అన్నీ వదిలేసి యువత బఃవిష్యత్తు గురించి యువతకి అండగా ఉండటానికి వచ్చా అని పవన్ అన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: