భర్తని ఎనిమిది ముక్కలు చేసింది.. ఒక్కో పార్ట్ ఒక్కో దేగ్గర పారేసింది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశ రాజధాని అయిన ఢిల్లీ లో రోజురోజుకీ క్రైమ్ రేట్ పెరిగిపోతుంది..! అత్యాచారాలు హత్యలకి ఢిల్లీ కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిపోతుంది. తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక భార్య తన భర్తని అత్యంత కిరాతకంగా హత్య చేసింది. అతని శవాన్ని ఎనిమిది ముక్కలుగా కొసింది ఒక్కో ముక్కని ఒక్కో ప్రదేశంలో పారేసింది. మిగితా భాగాల్ని తాను ఉంటున్న ఇంట్లోనే పాతి పెట్టింది. కొన్ని రోజులు ఎవ్వరికీ అనుమానం రాకుండా మేనేజ్ చేసింది చివరికి చట్టం చేతికి చిక్కి జైల్లో ఊచులు లెక్కేస్తుంది.

వివరాల్లోకి వెళితే.. 2006 సంవత్సరం లో సునీత (25) రాజేశ్ (50) ని పెళ్లి చేసుకుంది. ముందు అంతా బాగానే ఉన్నప్పటికి సునీత రాజేష్ లు ఇల్లు మారారు.. అక్కడ సునీత పక్కింటి యువకుడి తో మాట్లాడటం మొదలు పెట్టింది ఇక అక్కడితో సమస్య మొదలయ్యింది. ఈ విషయం భర్తకి తెలిసి రోజు గొడవ చేసేవాడు అతని అనుమానం వారి మద్య గొడవలు అంచలంచాలుగా పెరిగిపోయాయి. వీరిద్దరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు.

గొడవలు పెరిగిపోయి అసేహ్యించుకోవడం మొదలు పెట్టారు. రాజేశ్ సునీత పైనే కాకుండా సునీత తల్లి మీద కూడా కోపాన్ని చూపించాడు. ఒకనాడు సునీత తల్లి ఇంటికి వచ్చింది ఆమె ని అక్కడ నుండి వెళ్లిపోమని రాజేశ్ హెచ్చరించాడు. స్టేషన్ కి వెళ్ళి దింపొస్తానని ఆమెని అక్కడ నుండి తీసుకెళ్లిపోయాడు. రాజేశ్ ఇంటికొచ్చాడు కానీ సునీత తల్లి ఊరికి చేరుకోలేదు.. ఆమె అదృశ్యం అవ్వడంతో సునీతకి రాజేశ్ పై అనుమానం మొదలయ్యింది, రోజులు గడిచాయి తన తల్లి ఆచూకీ తెలియట్లేదు ఇక రాజేశ్ ఏ చంపేశాదేమో అని భావించిన సునీత రాజేశ్ ని చంపేయాలని ఫిక్స్ అయ్యింది.

ఎలా చంపాలో చంపిన తరువాత ఏం చేయాలో అన్నీ తెలుసుకుంది.. ఇక అతనిని చంపడానికి ప్లాన్ వేసింది. ప్లాన్ ప్రకారం ప్రేమికుల రోజున సునీత తన కుమారుడిని ఆడుకోడానికి తెలిసిన వారింట్లో వదిలి వచ్చింది. రాజేశ్ కి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చింది మట్టులోకి జారుకున్న రాజేశ్ గొంతు నులిమి చంపేసింది. గంటలు కష్టపడి రాజేష్ శవాన్ని 8 ముక్కలుగా కొసింది. తలని ని కవర్ లో కట్టి చెరువు లో పారేసింది. కళ్లని మరో చెరువు లో పారేసింది. మొండాన్ని తాను ఉంటున్న ఇంట్లోనే పూర్చి పెట్టింది ఇక ఒక్కో పార్ట్ ని ఒక్కో ప్లేస్ లో పారేసింది. పదిని రక్తాన్ని ఇంటిని శుబ్రమ్ చేసుకుంది.. అలా రెండు రోజులు గడిచాకా రాజేశ్ ఇంకా ఇంటికి రాలేదని పోలీసులకి ఫిర్యాదు చేసింది.

ఇక చుట్టూ పక్క వాళ్ళందరూ అసలు రాజేశ్ కి ఏమయ్యి ఉంటుంది అని ప్రశ్నించగా అమాయకంగా యాక్ట్ చేసింది.. అయితే ఆ ఇంటి యజమాని విషయం తెలిసి ఇంటికొచ్చాడు తనకి ఇల్లు సరిగ్గా కనిపించలేదు పెరట్లో అంతా మట్టి మట్టిగా ఏదో చేసినట్టుగా కనిపించింది ఇక ఆ స్థలన్నీ పరిశీలించిన యజమాని అక్కడ మట్టిని చరుపుతుండగా ఒక వేలు కనిపించింది ఇంకాస్త చరపగా ఒక చేతు కనిపించడంతో ఆయన పోలీసులకి ఫిర్యాదు చేశాడు. రంగం లోకి దిగిన పోలీసులు అక్కడ తవ్వకాలు జరగగా రాజేశ్ శరీరం ఊహలకందని విదంగా ముక్కలై కళ్ళు తిరిగే రేంజ్ లో కనిపించింది.ఆ దృశ్యాలు చూసి పోలీసులు సైతం కంగు తిన్నారు.

పోలీసులు ఈ విషయమై ఆమెని ప్రశ్నించగా నిలకడ లేని జవాబులు చెప్పింది పోలీసులు ఇంకాస్త గట్టిగా ప్రశ్నించేసరికి బోరున ఏడ్చి చంపింది తానే అని ఒప్పుకుంది. జరిగిందంతా చెప్పుకుంది.. ఆ ముక్కలని ఎక్కడెక్కడ పారేసిందో అన్నీ ప్రదేశాలు చూపించింది. గత కొన్ని సంవత్సరాలుగా తమ మద్య ఎటువంటి సంబంధం లేదని విడాకుల గురించి పక్కింటి వ్యక్తి సహాయం తీసుకోడం తో రాజేశ్ కి అనుమానం మొదలయ్యిందని ఇక తన తల్లి విషయం లో కూడా రాజేశ్ హస్తమే ఉందని ఆమె భావించిందని అందుకే చంపేశానని ఆమె చెప్పింది. ఇక పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆమెని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: