తమ భూమాలని కొందరు అక్రమంగా విఆర్ఓ లకి లంచాలు ఇచ్చి అక్రమంగా పట్టాలు చేయించుకుంటున్నారని శరత్ అనే ఒక రైతు సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు దీనిని చూసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ఆ రైతుకీ కాల్ చేసి తన తో మాట్లాడాడు తనకి దైర్యం చెప్పి ఆ రైతు ఉన్న గ్రామానికి కలెక్టర్ హూలికేరి భారతిని వెళ్ళి సమస్యని పరిష్కరించవలసిందిగా ఆదేశించారు.
వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల, నెన్నెల మండలానికి చెందిన శరత్ అనే రైతుకీ వంశపారపర్యంగా భూమి వచ్చింది అయితే ఆ భూమిని అదే ఊరికి చెందిన కొందరు ఆ ఊరు విఆర్ఓ కి లంచం ఇచ్చి ఆ పట్టాలను తమ పేరుకి మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. ఈ విషయం తెలుసుకున్న శరత్ తన ఆవేధనని సోషల్ మీడియా లో వ్యక్తపరుస్తూ పోస్ట్ చేశాడు..
ఈ పోస్ట్ ని చూసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ వ్యక్తికి స్వయానా ఫోన్ చేసి ఆ వ్యక్తి సమస్య తెలుసుకొని ఆ రైతుకీ సమస్య పరిషరిస్తాం అని హామీ ఇచ్చారు. ఆ రైతు సమస్యని కలెక్టర్ హూలికేరి భారతి కి చెప్పి ఆమెని ఆ గ్రామానికి వెళ్ళి సమస్య పరిష్కరించమని ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు అందుకున్న అనంతరం కలెక్టర్ భారతి వెంటనే ఆ గ్రామానికి వెళ్ళి ఆ రైతు సమస్యని పరిష్కరించారు.
కేసీఆర్ ఆ వ్యక్తి తో మాట్లాడినా కాల్ ఆడియో :