రాహుల్ జర్నలిస్ట్ ని కాపాడాడు.. జనం హృదయం గెలిచాడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి మానవత్వాన్ని చాటి వార్తల్లో నిలిచాడు. నేను ప్రజల మనిషినీ అని చెబుతున్నా రాహుల్ చెప్పిన మాటకి తగ్గ పని చేసి నేడు ప్రజల మనసు దోచుకున్నాడు. రాహుల్ గాంధీ ఒక జర్నలిస్ట్ ని రోడ్ మీద పడుతుండటం చూశాడు ఆ జర్నలిస్ట్ నుడిటికి రక్తం కారుతున్నపుడు చూసి ఆయనని తన కారు ఎక్కించుకొని ఆసుపత్రికి తరలించారు.. ఈ వార్తాలని ఒక మీడియా వారు ముందు ప్రసారం చేశారు కాగా వివేక్ బర్మెరి అనే ఒక వ్యక్తి రాహుల్ మరియు ఆ జర్నలిస్ట్ రాహుల్ కార్ లో వెలుతున్నప్పుడు తీసిన వీడియో ని తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ చాలా వైరల్ అవుతుంది.

సమాచారం ప్రకారం రాహుల్ గాంధీ సెంట్రల్ ఢిల్లీ లోని హుమాయూన్ రోడ్ లో కార్యక్రమానికి వెళుతున్నారు వెళుతున్నారు ఆ సమయం లో అక్కడ విడియోని టెలికాస్ట్ చేస్తున్న రాజేంద్ర వ్యాస్ అనే జర్నలిస్ట్ అనుకోకుండా మెట్లు దిగుతూ పడిపోయాడు దీన్ని చూసిన రాహుల్ వెంటనే తన కారుని ఆ జర్నలిస్ట్ వైపు తీసుకెళ్లమని ఆ జర్నలిస్ట్ ని తన కారులో ఎక్కించుకున్నాడు. ఆ జర్నలిస్ట్ నుదుటికి దెబ్బ తగలడంతో రక్తస్రావం అవుతుంది. రాహుల్ స్వయానా తన కర్చీఫ్ తో ఆ జర్నలిస్ట్ రక్తాన్ని తుడిచి వెంటనే అక్కడ సమీపం లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించాడు. ఇక జర్నలిస్ట్ ని రోడ్ మీద పడుండటం చూసి ఆయనని అక్కడ నుండి తీసుకెళ్లి స్వయానా ఆసుపత్రికి తరలించి రాహుల్ చాలా మంది మనసులు గెలుచుకున్నాడు అనే చెప్పాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: