నీకిప్పుడు చూపిస్తా బాబు..! కాస్కో..!

Google+ Pinterest LinkedIn Tumblr +

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న ప్రకాశం జిల్లాలో సభలు నిర్వహించారు. ఆయన సభలో మాట్లాడుతూ టీడీపీ అధినేత పై తారా స్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు పై మండిపడుతూ ఆయనపై నిప్పులు చెరిగారు. గత ఎన్నికల్లో ఆయన చంద్రబాబు కి మద్దతు పలికిన విషయం తెలిసిందే.. మద్దత్తు తెలిపిన నాపైనే దాడులు చేసారంటూ ఆయన మండిపడ్డారు. మద్దతు తెలిపింది అభివృద్ధి కొరకని కానీ ఐదేళ్లు ఆయన పాలన చూస్తూ విసిగిపోయానని పవన్ అన్నారు.

గత ఎన్నికల్లో మద్దత్తు తెలిపి ఆయన కొరకు ప్రచారాలు చేసి అధికారం ఇప్పిస్తే తెలుగుదేశం పార్టీ నేతలు చేసిందేమి లేదని పార్టీ నేతలందరూ అవినీతి అక్రమాలతో ఈ అయిదేళ్లు గడిపారాణి ఆయన అన్నారు. ఈ అయిదేళ్లలో వీరి అవినీతి అక్రమాలు చూసి విసిగిపోయాము. అందుకే ఈసారి మద్దత్తు తెలపకుండా ఒంటరిగా పోటీకి దిగాణని ఆయన అన్నారు. చంద్రబాబు అవిటినీతి తో సంపాదించిన వేలాది కోట్లతో ఇప్ప్దుడు రాజకీయం చేస్తున్నారని ఆయన బాబు పై ద్వాజమెత్తారు.

ఆయనకి మద్దత్తు తెలిపితే నాకు రాజకీయం తెలియదని ఆయన అన్నారు బాబు ఇప్పుడు చెబుతున్నా కాస్కో నా రాజకీయం నీకు చూపిస్తా.. అసలు రాజకీయం అంటే ఏంటో నీకు చూపిస్తా..! అని పవన్ సవాల్ విసిరారు. తమ పార్టీ నుండి సామాన్యులు అధికారం లోకి రావాలని డబ్బు రాజకీయాలని పారదోలే నేతలు ఉండాలని సామాన్యులకే టికెట్ లు ఇచ్చానని పవన్ చెప్పుకొచ్చారు. తమని అధికారం లోకి తీసుకొస్తే 18 నెలల్లో వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

చిన్నప్పుడు ఒంగోలు లో ఉన్నాము ఇక్కడ తిరిగాము ఈ ప్రాంతం గురించి నాకు తెలుసు ఇది నా ప్రాంతం అనుకోని పని చేస్తా అని ఆయన హామీ ఇచ్చారు. 6 నెలల్లో 3 లక్షల ఉద్యోగాలను బర్తి చేయిస్తామని ఆయన అన్నారు. తాను అధికారింలోకి వస్తే జిల్లాలో ఒంగోలు గిత్తల అభివృద్ధి, వ్యవసాయానికి వెయ్యి కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. తమ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని ప్రజలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: