ఇద్దరు వెంకటేశ్వర్లు..! నలుగురు సుమలతలు..! ఏంటీ తికమక..?

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశవ్యాప్తంగా ఎన్నికలు దేగ్గర పడుతున్నాయి అధినేతలు మరి కొన్ని రోజులు మాత్రమే ఉండటంతో చిత్రా విచిత్రమైన వ్యూహాలు పన్నుతున్నారు. ప్రజలని మరియు అభ్యర్థులని తికమక పడేలా సన్నాహాలు చేస్తున్నారు. నామినేషన్ దాఖలు చేసే సమయం లో కూడా తికమకలే.. అప్పటినుండి తికమక, అనే పధం ఊరూరికే వస్తుందెంటి అనుకుంటున్నారా..? అవును కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ తికమకలే ట్రెండ్..! పార్టీ అధినేతలు పన్నుతున్న వ్యూహాలు ఇలాగే ఉంటున్నాయి.. మన తెలుగు ఆంధ్రపరదేశ్ లోనూ కర్ణాటక లోనూ నామినేషన్ వేల ఇలాంటి తికమకలే చోటు చేసుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్ తికమక కథ :

ఆంధ్రప్రదేశ్ లో మొన్న నామినేషన్ దాఖలు చేయడానికి చివరి రోజు వైసీపీ పార్టీ నుండి పర్చూరు నిజోజకవర్గం అభ్యర్థి దగ్గుబాటి వేంకటేశ్వర రావు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్ వేసిన రోజే ప్రజాశాంతి పార్టీ పర్చూరు అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేశారు. అయితే విచిత్రమో.. వ్యూహమో..! కానీ ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి పేరు కూడా డీ. వెంకటేశ్వర్ రావు ఏ ఉండటం గమనార్హం ఇద్దరు డీ. వెంకటేశ్వర్ అయ్యేసరికి అక్కడ గందరగోళం ఏర్పడింది. అయితే ఇలాంటి పరిస్థితే కర్నాటక మాండ్యా లో చోటు చేసుకుంది అక్కడ కూడా ప్రజల్ని తికమక పెట్టేందుకు అక్కడి అధినేతలు పన్నాగం పన్నారు.

కర్ణాటక తికమక కథ :

మాండ్యా నిజోజకవర్గం ఎంపీ అభ్యర్థుల నామినేషన్ లో కూడా ఇలాంటి గందరగొలమే ఏర్పడింది. మాండ్యా నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రముఖ నటి సుమలత నామినేషన్ వేసింది.. ఇక ఆమెకి పోటీగా కర్నాటక సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడా కాంగ్రెస్ జేడీఎస్ పొత్తు అభ్యర్థి గా నామినేషన్ వేశాడు. అక్కడ నుండి బీజేపీ ఈ ఎనికల్లో పోటీ చేయడం లేదు. వారి మద్దత్తుని సుమలతకి ఇవ్వవలసిందిగా యడ్యూరప్ప అక్కడి బీజేపీ వర్గాలకు పిలుపునిచ్చాడు. ఇక మాండ్యా నియోజకవర్గం కాంగ్రెస్ వర్గాలు కూడా సుమలతకే మద్దతు పలుకుతున్నాయి. ఇక కుమారస్వామి అక్కడ నుండి తన కొడుకు ఎలాగైనా గెలవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఈ విషయం ఇలా ఉంటే.. ఇక్కడ సుమలత నామినేషన్ వేసిన రోజే అక్కడ నుండి మరో ముగ్గురు ఇండిపెండెంట్ అబ్యర్తులుగా నామినేషన్ వేశారు.. ఆ ముగ్గురూ మహిళలే పైగా ఆ ముగ్గిరి పేర్లు కూడా సుమలత గా ఉండటం గమనార్హం. ఒకే సుమలత పై ఇప్పుడు మరో ముగ్గురు సుమలతలు ఒకేస్థానం నుండి పోటీకి దిగారు. ఇక ఆ ముగ్గురు సుమలతలతో కలిపీ మాండ్యా నియోజకవ్రగామ్ నుండి నలుగురు సుమలతలు అయ్యారు.

ఇక ఈ నలుగురి నామినేషన్లతో ఎన్నికల అధికారులు అక్కడి పార్టీ వర్గాలు అక్కడి ప్రజలు అందరూ తికమకకి గురవుతున్నారు..! ఇక సినీ నటి సుమలత దీని పై స్పందిస్తూ ఇదంతా కేవలం రాజకీయంగా నన్ను ఎదుర్కొలేక చేస్తున్న కుట్ర..  నాటకం..! నన్ను ఎదుర్కొలేకనే కాంగ్రెస్ జేడీఎస్ లు ఈ కుట్ర కి పాల్పడ్డాయి ప్రజలని మభ్య పెట్టె చర్య చేస్తున్నారు ఏది ఏమైనా ఈసారి నా గెలుపు తద్యం అని ఆమె అన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: