భీమవరం బరిలో వర్మ..! వర్మ ట్వీట్ వైరల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా ఏం ట్వీట్ చేసినా అది వివాదమే. వివాదాల వర్మగా ఈయనకి పేరు కూడా ఉంది. అయితే ఈయన పవన్ కళ్యాణ్ పై ట్వీట్ చేశాడు. వర్మ ఎప్పుడూ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూనే ఉంటాడు వారిపై విమర్శలు చేయడం వర్మకి అలవాటు. పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ వర్మ చాలా సార్లు ట్వీట్ చేశాడు. కానీ కొద్ది రోజులుగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకి వచ్చిన చిక్కుల్ని తీయడంలో బిజీగా ఉండి పవన్ ని కానీ నాగబాబు ని కానీ ఉద్దేశిస్తూ ట్వీట్ చేయలేదు.

తాజాగా పవన్ ని ఉద్దేశిస్తూ వారం ట్వీట్ చేశాడు.. ఆ ట్వీట్ లో వర్మ..భీమవరం నుండి నేను కూడా పోటీ చేస్తున్నాను ప్రత్యేకంగా పవన్ గురించే రాజకీయ బరిలో దిగాను మరి కొద్దిసేపట్లో వివరాలు వెల్లడిస్తాను.. అన్నారు ఇక అంటే ఈ ట్వీట్ చాలా వైరల్ అయ్యింది. వర్మ రాజకేయాల్లోకి ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. ఇక మరి కొద్దిసేపటికే మరో ట్వీట్ చేశాడు.. నామినేషన్ గడువు ముగిసినప్పటికీ నాకు చాలా పై స్థాయి అధికారుల నుండి పవన్ పై పోటీకి అనుమతి లభించింది.. మరికొద్దిసేపట్లో వివరాలు వెల్లడిస్తానంటూ మరో ట్వీట్ చేశారు. ఇక ఈ రెండు ట్వీట్లు చాలా వైరల్ అయ్యాయి ఇది వర్మ టైమ్ పాస్ కి చేశాడా నిజమే చెబుతున్నాడా.. నామినేషన్ గడువు దాటాక ఎలా పోటీ చేస్తాడు.. ఇవన్నీ వట్టి మాటలే అంటూ నెటిజన్లు రియాక్ట్ అయ్యారు.

Share.

Comments are closed.

%d bloggers like this: