నాలుగేళ్ళు పార్ట్‌నర్ యాక్టర్ కలిసి కాపురం చేశారు-జగన్

Google+ Pinterest LinkedIn Tumblr +

పాలకొల్లు బహిరంగ సభలో పాల్గొన్నారు వైసీపీ అధినేత జగన్..! అక్కడ ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పవన్ లపై ద్వాజమెత్తారు. ఇద్దరి పై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. ఇద్దరూ కలిసి రాజకీయ విలువలు మరిచి ప్రవర్తిస్తున్నారని మండి పడ్డారు. ఇక వీరి పైనే కాకుండా జగన్ మీడియా పై కూడా నిప్పులు చెరిగారు.

చంద్రబాబు పార్ట్‌నర్ ఒక యాక్టర్ అని చంద్రబాబుతో చేరి ఈ యాక్టర్ ప్రతీ కుట్రలో పల్పంచుకున్నారని ఆయన పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఏం చెబితే పవన్ అది చేస్తున్నారని ఆయన పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. నాలుగేళ్ళు చంద్రబాబు తో కలిసి కాపురం చేశారని 2014 ఎన్నికల్లో ఆయన తరఫున ఎన్నికల్లో ప్రచారం చేశారని జగన్ అన్నారు. 2014 లో బాబు తరఫున ప్రచారం చేసి ప్రజలని టీడీపీ కి వోటు వేయమని అడగలేదా..? అని పవన్ ని ప్రశ్నించారు.

చంద్రబాబు చేసిన ప్రతి కుట్ర లో పవన్ కూడా ఉన్నాడు పవన్ కి ప్రతి అవినీతి లో కుట్ర లో వాటా ఉంది అని ఆయన పవన్ పై ఆరోపణలు చేశారు. చంద్రబాబు చేసే ప్రతి కుట్రలో పవన్ పాల్పంచుకున్నారని అలా 5 ఏళ్ళు గడిపి ఎన్నికలు దేగ్గర పడేసరికీ విడిపోయినట్టు డ్రామాలు చేస్తున్నారు అని ఆయన అన్నారు. పవన్ చేసే ప్రచారల్లో పవన్ నామినేషన్ వేసిన సమయం లో ఆయన కార్యకర్తలతో టీడీపీ కార్యకర్తలు కూడా ఉన్నారని జనసేన జందాలతో టీడీపీ జందాలు కూడా ఎగిరాయని జగన్ ఎద్దేవా చేశారు. ఇక పవన్ సభల్లో అసలు చంద్రబాబు పాలన పై కానీ చంద్రబాబు అవినీతి పై కానీ అసలు ప్రస్తావనే రాదు కేవలం నా గురించి తప్ప పవన్ చంద్రబాబు గురించి నోరు కూడా మెదపరు అని ఆయన పవన్ పై మండిపడ్డారు.

మీ కుటుంబంలో ఒకరిని బాబు హత్య చేయించి, మీరే ఆ పని చేశారు? అని చంద్రబాబు, ఆయన అనుకూల ఎల్లో మీడియా ప్రచారం చేస్తుంటే మీకు బాధనిపించదా? అంటూ పవన్‌ను ప్రశ్నించారు. తనకు కలిగిన ప్రతి కష్టం, నష్టంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు, ఆయన ఎల్లో మీడియా ఎంతో ఆనందించిందని ధ్వజమెత్తారు. చివరకు తమ చిన్నాన్న హత్యను కూడా పండగ చేసుకున్నారని…రాజకీయాలతో పాటు, మీడియా కూడా దిగజారిందని అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇక ఎన్నికలు దేగ్గర పడుతుండటం తో బాబు ఇలాంటివి మరెన్నో అసత్య ప్రచారాలు చేస్తారని వాటిని ప్రజలు నమ్మోద్దని ప్రజలకి విజ్ఞప్తి చేశాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: