లక్ష్మీస్ ఎన్టీఆర్..! విదేశాల్లోనూ క్రేజ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

గత కొద్ది రోజులుగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో వర్మ బిజీగా ఉన్నారు. సెన్సార్ బోర్డ్ అని ఎన్నికల కమీషన అని వర్మని వివాదాలు చుట్టుముట్టాయి. ఇక వాటితో బిజీగా ఉన్న వర్మ చివరకి ఆయన అనుకున్నది సాధించాడు. ఆ వివాదాల చిక్కుల్ని ఒక్కోక్కటిగా వేరు చేసి సినిమాని విడుదలకి సిద్ధం చేశాడు. సినిమాని ఎంత అడ్డుకుందామని చూసినా ఆయన అన్నట్టుగా ఈ నెల 29 కి సినిమాని రిలీజ్ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాకి ప్రస్తుతం విదేశాల్లో కూడా మంచి డిమాండ్ వస్తుంది. మెల్‌బోర్న్ లో తొలి రోజు టికెట్లు అప్పుడే ఫుల్ అయిపోయాయి అని వర్మ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా ఎఫెక్ట్ గురించి కొత్తగా ఏమి చెప్పక్కర్లేదు.. ఇక ఇక్కడ ఎలా ఆడబోతుందో వేచి చూడాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: