ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు చిత్తూరు జిల్లా మదనపల్లి కి చేరారు. మదనపల్లిలో ఆయన సభ నిర్వహించారు. సభలో ఆయన వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ మీపై ఇప్పటికే చాలా కేసులున్నాయి.. ఒకవేళ కేంద్రం మీపై ఉన్న కేసులని మళ్ళీ తవ్వితే మీరు ప్రజలకి ఏం చేయగలరు అని ఆయన జగన్ ని ప్రశ్నించారు. టీడీపీకి కూడా మిమ్మల్ని ఎదుర్కునే దమ్ము లేదు.
నన్ను ఊరూరికే పార్ట్నర్ అంటున్నారు. అసలు పార్ట్నర్ జగన్.. జగన్ బీజేపీ పార్ట్నర్, టీఆర్ఎస్ పార్ట్నర్..! నేను కాదు. నేను గత ఎన్నికల్లో 2014 లో టీడీపీ కి సపోర్ట్ చేశాను టీడీపీ కి మద్దత్తు ఇచ్చాను. వారి పాలన చూశాను అర్ధం అయ్యింది. ఈసారి నేను టీడీపీ కి సపోర్ట్ చేయట్లేదు నేనెవ్వరి పార్ట్నర్ కాదు. ఒకవేళ నేను మద్దత్తు ఇస్తే ముందుగానే చెబుతాను మగాదిల చెప్పి మరీ సపోర్ట్ చేస్తాను అని పవన్ అన్నారు.
మీ లాగా ఢిల్లీ కి వెళ్ళి అమిత్ షా మోదీల కాళ్ల మీద పడి కేసులని తీయించుకొని ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టను. ప్రతిపక్ష నేత అసెంబ్లీ కి రారు జగన్ నిజంగా రాయలసీమ అభివృద్ధిని కోరుకుంటే అసెంబ్లీకి వెళ్లాలి. ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి వెళ్లాలి. నా దగ్గర ఒక్క ప్రజాప్రతినిధి లేకున్నా పోరాడాను. అంటూ ఆయన జగన్ పై మండిపడ్డారు.
నేను ఈసారి ఒంటరిగా పోటీ చేస్తున్నాను నాకు సీట్లు వస్తాయో లేదో కూడా తెలీదు. ప్రజలకి మంచి చేయడమే నా లక్ష్యం ప్రజలని అధికారం లోకి తీసురావడమే నా కోరిక.. నారా కుటుంబం వైఎస్ కుటుంబాలే రాజకీయాల్లోకి రావాలా..? సామాన్యులు రాకూడదా..? అని ఆయన ప్రశ్నించాడు. ఇన్ని ఎన్నికల్లో ఎవరెవర్నో నమ్మి అవకాశం ఇచ్చారు.. ఈ ఒక్క ఎన్నికల్లో జనసేనాని నమ్మి ఓటు వేయండి అని పవన్ కళ్యాణ్ ఓటర్లని కోరాడు.