ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారాలు హోరెత్తిస్తున్నాయి..! వేసవి వేడి ని మించి ప్రచారాల సెగలు రగులుతున్నాయి.. ! అధినేతలు ఒకరిపై ఒకరు నిప్పులు చారుగుకుంటున్నారు. ప్రచారాలు డిఫరెంట్ గా ఉండటానికి నేతలు వారి అనుభవాలను.. పరిచయిస్టులను.. మిత్రులను.. కుటుంబ సభ్య్లను ప్రచార బరిలో దింపుతున్నారు..! ఇక నేతలే కాకా వీరు కూడా వ్యంగ్యాస్త్రాలను సందిస్తున్నారు. చంద్రబాబు అయితే తన ప్రచారాలకి వేరే రాష్ట్రపు ముఖ్యమంత్రులని మాజీ ముఖ్యమంత్రులని రప్పిస్తున్నారు. ఇకపోతే వైసీపీ అధినేత జగన్ తన కుటుంబ సభ్యులని ప్రచార బరిలో దింపుతున్నారు.
నేటి నుండి జగన్ తల్లి విజయమ్మ ఆయన సోదరి షర్మిలా ప్రచారం లో పాల్గొంటున్నారు.. ఇప్పటికే షర్మిలా 2014 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున ప్రచారం చేసింది. ఇక తన తండ్రి తరహాలో తన అన్న తరహాలో 2012 లో పాద యాత్ర కూడా చేసింది. ఆ సమయంలో తన డైలాగ్స్ తో తన ప్రసంగాలతో సభలతో పార్టీ వర్గాలని వైఎస్ అభిమానులని తన అభిమానులుగా మార్చుకుంది. ఇక తనకి మంచి గుర్తింపు నిర్గళంగా మాట్లాడే ప్రతిభ ఉండటంతో జగన్ ఆమెని ప్రచారం చేయమన్నట్టుగా కోరినట్టు తెలుస్తుంది.
షర్మిలా నేటి నుండి దాదాపుగా 50 నియోజకవర్గాల్లో ప్రచారం చేయనుంది. దీని కొరకు ఇప్పటికే ఆమెకి ఒక బస్సు కూడా సిద్ధం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు ఒక జిల్లా లో పర్యటిస్తుంటే తన కుమారుడు లోకేష్ మరో జిల్లాలో పాల్గొంటున్నారు.. ఇద్దరు వేర్వేరు జిల్లాల్లో పాల్గొతున్నారు. ఇక ఇదే తరహాలో షర్మిలా కూడా తన అన్న ఒక జిల్లా లో ప్రచారం చేస్తుంటే ఈమె వేరే జిల్లాలో ప్రచారం చేయబోతుంది. నేడు మనగలగిరి లో షర్మిలా ప్రచారం మొదలుపెడుతుంది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని తాడేపల్లి నుంచి బస్సుయాత్ర తో ఈమె ప్రచారాలు మొదలవుతున్నాయి.