ఇదో కో ఇన్సిడెన్స్..! దేవుడు మాతోనే ఉన్నాడు..!- ఆర్జీవీ

Google+ Pinterest LinkedIn Tumblr +

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలయ్యింది..! సినిమా కంటెంట్ వివాదాస్పదంగా ఉండేసరికి ఈ సినిమా ఎన్నో కష్టాలు పడుతూ ఒక్కో అడ్డుని తొలగించుకుంటూ నేడు విడుదలయ్యింది. ఈ సినిమాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని రామ్ గోపాల్ వర్మ నెగిటివ్ గా చూపించడమే ఈ సినిమాని విడుదల అవ్వకుండా ఇన్ని రోజులు అడ్డుపడింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు మరి కొద్ది రోజుల్లోనే ఉన్నాయి, ఇలాంటి సమయం లో తమ నేతని నెగిటివ్ గా చూపిస్తే ప్రజల అభిప్రాయాలూ దెబ్బ తింటాయని ఓటర్ల పై ప్రభావం చూపుతుందని ఈ సినిమా పై టీడీపీ నేతలు హై కోర్టు లో స్టే విదించమని సినిమా రిలీజ్ అవ్వకుండా ఆపమని అప్పీల్ చేశారు. వారి వాదనలు విన్న హై కోర్ట్ ఈ సినిమాని ని ఆంధ్రప్రదేశ్ లో విడుదల చేయకుండా ఆపాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇక అంతకు ముందు కూడా ఇలా హై కోర్ట్ ఆదేశించడం తో కొన్ని రోజులు సినిమా ఆపాల్సివచ్చింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోర్టుకెక్కి వాదనలు వినిపించిన తరువాతా కోర్టు సినిమా విడుదల చేసుకోవచ్చని ఆదేశించింది. సరే విడుదల చేసుకుందాం అనే లోపే మళ్ళీ టీడీపీ నేతలు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు ఇక అక్కడ కొన్ని రోజులు జాప్యం అయ్యింది. ఇక అక్కడ కూడా సినిమా గ్రీన్ సిగ్నల్ పడగానే సెన్సార్ బోర్డ్ చిక్కు ఇక అక్కడ మళ్ళీ జాప్యం..! అక్కడ కూడా గ్రీన్ సిగ్నల్..! ఇక చిత్రా నిర్మాత సినిమా ని రిలీజ్ చేసుకోవచ్చని ఈ నెల 29 నా సినిమా రిలీజ్ అని అధికారిక ప్రకటన చేశాడు.. ఇంతలోపే మరో చిక్కు దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమా ఇప్పుడు వాయిదా పడింది. ఇక ఆంధ్రప్రదేశ్ తప్ప దేశ వ్యాప్తంగా సినిమా నేడు విడుదల అయ్యింది.

ఇక ఇక్కడ గమ్మత్తు ఏంటంటే.. నేడు 29 న సినిమా అనుకోకుండా రిలీజ్ అవ్వడం. ఈ 29 న మరో స్పెషాలిటీ ఉంది..! అదేంటంటే నేడే తెలుగుదేశం పార్టీ స్తాపించిన రోజు. 1982 మార్చి 29 నా టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామా రావు పార్టీని స్తాపించారు. ఇక సినిమా ఇన్ని రోజులు వాయిదా పడుతూ నేడే రిలీజ్ అవ్వడం కొ-ఇన్సిడెన్స్ అని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఎవరెన్ని కారణాలు చెప్పి సినిమా విడుదలని వాయిదాలు వేయించినా తెలుగు దేశం పార్టీ స్థాపించిన రోజే అనుకోకుండా విదూయాల అయ్యింది.. దేవుడు మా సినిమాని ఆశీర్వదించాడు అనడానికి ఇదే నిదర్శనం అంటూ వర్మ ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన ట్వీట్ చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: