వైసీపీ నేతలు ఈ పని చేయండి..!కత్తి మహేష్ వైరల్ పోస్ట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరక్కెకించిన వివాదాస్పద సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ దేశ వ్యాప్తంగా విడుదలయ్యింది. దేశవ్యాప్తంగా సినిమా అనుకున్న సమయానికే విడుదల అయ్యింది కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈ సినిమా కి వాయిదా పడింది. హైకోర్ట్ ఏప్రిల్ మూడో తారుకున ఈ సినిమా చూసి తీర్పు ఇస్తామని చెప్పింది. ఇక అక్కడి ప్రజలు ఈ సినిమా తప్పకుండా చూడాలని సినీ క్రిటిక్ కత్తి మహేశ్ తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు.

కత్తి మహేశ్ వైసీపీ అదినేతకి పార్టీ వర్గాలకి ఈ సినిమా ఆంధ్ర ప్రజలకి చూపించాలని ఆ బాధ్యత తీసుకోవాలని మనవి చేశాడు. ఆయన పెట్టి పోస్ట్ ఆధారంగా.. చిత్తురు లో ఉన్న వాళ్ళు చెన్నై కి. అనంతపురం కడప లో ఉన్న వాళ్ళు బెంగళూరికి. కర్నూల్ లో ఉన్న వాళ్ళు కర్ణాటకాకి , విజయవాడ లో ఉన్న వాళ్ళు సూర్యపేట కి.. ఉత్తరాంధ్ర లో ఉన్న వాళ్ళు ఒరిస్సా కి లక్ష్మీస్ ఎన్టీఆర్ చూడటానికి వెళ్లాల్సి వస్తుంది అని ఆయన అన్నారు.

వీళ్ళందరి కోరిక తీర్చాలని వైసీపీ కార్యకర్తలకి కాకుండా న్యూట్రల్ ఓటర్లకి ఈ సినిమా చూపించాలని కత్తి మహేశ్ మనవి చేసుకున్నారు. ఈ సినిమా చూపించే బాధ్యత వైసీపీ నేతలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఎలాగో ప్రచారాలకి బాగానే ఖర్చు చేస్తున్నారు ఆ సభలు నిర్వహించే ఖర్చు లో పదో వంతు ఖర్చు చేసినా చాలు చంద్రబాబు గురించి ఆంధ్ర ప్రజలు అందరికీ తెలిసిపోతుందని ఆయన అన్నారు. చంద్రబాబు గురించి అందరూ గొంతు చించుకోని ఆరావాల్సిన పని అప్పుడు ఉండదు అని ఆయన వైసీపీ నేతలకి సలహా ఇచ్చారు. ఒక పక్క ఆర్జీవీ ట్వీత్లకే కాకుండా ఇప్పుడు సినీ క్రిటిక్ కత్తి మహేశ్ కూడా సినిమా కి సంబంధించి ట్వీట్ లు పోస్ట్ లు చేస్తున్నాడు.. ఈ పోస్ట్ లు కాస్త వైరల్ అవుతున్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: