అనుమానం..! ఆపై వాంతి..! పెళ్లి రోజునే విడాకులు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కర్ణాటక రాష్ట్రానికి చెందిన రక్షిత(26), శరత్(29) లు ఎం‌బీఏ పూర్తి చేసుకొని పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. పెళ్లి ఈడు వచ్చేసరికి మ్యాట్రిమోని లో వివరాలు పెట్టగా వీరికి ఒకరికొకరు పరిచయం అయ్యారు.. ఇక పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నారు. తాజాగా వీరిద్దరికి పెళ్లి అయ్యింది. పెళ్లయ్యింది వెంటనే విడాకులకి అప్లై చేశారు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..! పెళ్లి రోజు రక్షిత వాంతి చేసుకుంది. వాంతి చేసుకోగానే సహరత్ కి అనుమానం వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్ళాడు అక్కడ రక్షిత కి గర్భం పరీక్ష చేయించాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె శరత్ పై మనసు విరిగి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇప్పుడు వీరిద్దరు డివోర్స్ కి అప్లై చేశారు.

అసలు ఆ వరుడికి అనుమానం ఎందుకు వచ్చింది..? ఆ అమ్మాయి వాంతి ఎందుకు చేసుకుంది..? ఉన్నట్టుండి విడాకులు ఎందుకు తీసుకుందాం అనుకున్నారు అనే ప్రశ్నలు వచ్చాయి కదా..! అయితే అసలు విషయానికొస్తే.. కొద్ది నెలల క్రితం రక్షిత శరత్ లు పెళ్లి చేసుకుందామని తేదీ ఖారారు చేయించుకున్నారు.. ఇంతలోనే రక్షిత తల్లి క్యాన్సర్ తో మరణించింది. దీంతో రక్షిత డిప్రెషన్ కి గురయ్యింది. ఇక డిప్రెషన్ కి వచ్చిన రక్షిత కి తోడుగా తన మిత్రుడు అండగా నిలిచాడు.

ఇక వీరి మిత్రుత్వం పై శరత్ కి అనుమానాలు వచ్చాయి.. ఇక కొద్ది రోజుల తరువాత రక్షిత శరత్ ల పెళ్లి జరిగింది ఇక ఆ పెళ్లి భోజనం సరిగ్గా అరగక రక్షిత వాంతులు చేసుకుంది. ఇక ముందటి నుండే అనుమానం.. ఆపై వాంతి..! జరగడం తో శరత్ రక్షితని ఆసుపత్రికి తీసుకువెళ్లి పరీక్షలు చేయించాడు. ఈ విషయం తెలిసిన రక్షిత వెంటనే తన చెల్లి ఇంటికి వెళ్లిపోయింది. ఇక భార్య ఇంటికి రావడం లేదని శరత్ పోలీసులని ఆశ్రయించాడు.. కౌన్‌సిలింగ్ కొరకు రక్షిత ని పిలిచిన పోలీసులు విషయాన్ని తెలుసుకోగానే కంగు తిన్నారు. ఇక ఇద్దరికీ కౌన్‌సిలింగ్ ఇచ్చినప్పటికీ వీరి మనసులు మారలేదు. ఇక ఇద్దరు ప్రస్తుతం విడాకులకి అప్లై చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: