మేము ఆ గట్టున ఉండము..!ఈ గట్టున ఉండము..!-హై కోర్ట్

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి ఒక పక్క ఉంటే అధికారుల బదిలీలు మరో పక్క వివాదాలకి దారి తీస్తున్నాయి. మొన్న చంద్రబాబు రక్షణ పర్యవేక్షించే అధికారులని బదిలీ చేస్తూ నోటీసులు వచ్చాయి ఇక నేడు ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

ఈ నెల 26 న కడప శ్రీకాకులమ్ ఎస్పీ ల తో పాటు డీజీ ఏబీ వేంకటేశ్వర రావు ని బదిలీ చేస్తూ సీఈసీ ఆదేశాలు ఇచ్చింది. సీఈసీ అధికారులని బదిలీ చేయాలి అంటూ హై కోర్ట్ కి అప్పీల్ చేసింది. ఇక సీఈసీ ఇచ్చిన ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్ట్ శుక్రవారం నాడు తీర్పుని వెల్లడిచ్చింది.

ఇక ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకొని సీఈసీ ఇచ్చిన ఆదేశాలను సవాల చేస్తూ పిటీషన్లు వేసింది. ఇక ఈ విషయాన్ని మరోసారి పరిశీలించి తాము ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పేసింది. ఇక వేసిన పిటిషన్ ని ఏపీ సర్కార్ కొట్టివేసింది. ఇక ఇంటెల్లిజెన్స్ డీజీ ఏబీ వేంకటేశ్వర రావుని సీఈసీ పరిధి నుండి తప్పిస్తూ ఆయనని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి తరలించింది. ఎన్నికలకి డీజీ విధులకి సంబంధం లేదని ఆయనని తప్పిస్తూ ఏపీ సర్కార్ జీవోను జారీ చేసింది.

Share.

Comments are closed.

%d bloggers like this: