నాని ఒక దుర్మార్గుడు..! చిత్తు చిత్తుగా ఓడించండి..!-బాబు

Google+ Pinterest LinkedIn Tumblr +

కృష్ణా జిల్లా గుడివాడలకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత ప్రచారానికి వచ్చాడు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ గుడి వాడ అభ్యర్థి.. కొడాలి నాని పై నిప్పులు చెరిగాడు. అసలు ఈ వ్యక్తి ఎక్కడనుంచి ఎలా వచ్చాడు..? ఈ వ్యక్తి ఏ పార్టీ లో పుట్టాడు..? ఇప్పుడు ఏ పార్టీ లో ఉన్నాడు..? అని బాబు ప్రశ్నించాడు. కొడాలి నాని తనకంటే పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నైజాం నానిది అని చంద్రబాబు ఆయన పై మండిపడ్డాడు.

అసలు ఈ వ్యక్తి ఇక్కడికి ఎప్పుడైనా వస్తాడా ఎన్నికలు రాగానే మాటలతో వచ్చి చాలా మాట్లాడుతున్నాడు. అసలు మిలొ ఎవ్వరికైనా ఎప్పుడైనా నాని ఏమైనా చేశాడా అని బాబు సభకి వచ్చిన ప్రజలని అడిగాడు. ఓట్లు కొంటాడు గెలిచిన తరువాతా వ్యాపారాలు చేసుకుంటాడు అసలు ఇలాంటి వ్యక్తి మీకు అవసరమా..? మా పార్టీ నుండి గుడివాడ తరఫున అవినాష్ ఇక్కడే ఇల్లు కొని ఇక్కడే ఉంటూ స్థిరపడ్డాడు. మీ అందరికీ వీలుగా ఉంటాడు. నాని లాంటి వ్యక్తి కి ఓటు వేయొద్దు. అలాంటి దుర్మాగుడిని చిత్తుచిత్తుగా ఓడించాలని చంద్రబాబు ప్రజలని కోరారు.

నాని కులాల గురించి మాట్లాడుతున్నాడు. కులాలని కుటుంబాలని కలిపే వ్యక్తిని నేను కేఈ, కోట్ల కుటుంబాలను తాను కలిపానని… ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలను కలిపానని… పరిటాల రవి, జేసీ దివాకర్ రెడ్డి కుటుంబాలను కలిపానని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ కలవాల్సిన అవసరం ఉందని అన్నారు ఏ కులం వారినైనా ఓటు అడిగే హక్కు ఉన్న ఏకైక నాయకుడిని నేను అంటూ ఆయన అన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: