భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రచారం లో భాగంగా తెలంగాణ మెహబూబ్ నగర్ చేరుకున్నారు. ఆయన సభకి అనూహ్య స్పందన లభించింది. సభ లో మోదీ మాట్లాడుతూ కేసీఆర్ పై విమర్శలు చేశారు.. ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ మే నెలల్లో కేసీఆర్ జాతకం బాలేదని అప్పుడు అసెంబ్లీ ఎన్నికలకీ వెళితే ఆయన ఓడిపోతారని కేసీఆర్ కి జ్యోతిష్యులు చెప్పారని మోదీ అన్నారు. ఏప్రిల్ మే నెలల్లో నాకు బాగుందని తెలిసి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకీ ప్రాముఖ్యత ఇచ్చారు అని మోదీ అన్నారు.
ముందస్తు ఎన్నికల పేరిట ప్రజలకి 100 కోట్లు అదనం గాభారం పడిందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుని కేసీఆర్ నిర్ణయించాలా లేక ఆయన జ్యోతిష్యులు నిర్ణయించాలా అని మోదీ ప్రశ్నించారు. కేసీఆర్ కాంగ్రెస్ రెండు ఒకే నాణేనికి చండిన ముఖాలు అని ఆయన విమర్శించారు. ఈ అయిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏమి బాగుపడలేదని కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని ఆయన ఆరోపించారు. కుటుంబం కొరకు రాష్ట్రాన్ని గాలికి వదిలేశారని కేసీఆర్ పై మండి పడ్డారు.
డబుల్ బెడ్ రం ఇల్లులు కటిస్తానని కేసీఆర్ ప్రజలని మోసం చేశారని ఆయన గుర్తు చేశారు. గడిచిన ఐదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్ని రహదారులకి రైల్వే లైన్ లకి నిదులు మంజూరు చేసినదని వివరించారు. మీ ఆదేశాలని నేను చిరసావహిస్తాను.. మీ అందరి అభివృద్ది కొరకు రాత్రింబవళ్ళు పని చేస్తాను అని మోదీ అన్నారు. మీ ఆశీర్వాదం పొందేందుకు మరోసారి తెలంగాణ కి వచ్చాను అని మోదీ గుర్తు చేశారు.