బాబుకి కొత్త పేర్లు పెట్టిన మోదీ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారంలో భాగంగా నేడు తెలుగు రాష్ట్రాల్లో సభలు నిర్వహించారు. ముందు తెలంగాణ రాష్ట్రంలో మెహబూబ్ నగర్ లో ఆయన సభ లో ప్రసంగించారు అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లా లో నిర్వహించిన సభకి ఆయాన హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై నిప్పులు చెరిగారు.. బాబు కి ఆయన కొత్త పేర్లు కూడా పెట్టాడు..! ప్రజలందరూ బాబు ని యూటర్న్ బాబు స్టిక్కర్ బాబు అంటున్నారని ఆయన బాబు పై వ్యంగ్యంగా విమర్శించారు. ఇక ఆయన మంజూరు చేసిన కొన్ని ప్రాజెక్టుల గురించి ఆయన మజూరు చేసిన కొన్ని కార్యక్రమాల గురించి వెల్లడించారు.

మోదీ మాట్లాడుతూ ముందుగా ఉయ్యలవాడ నరసింహ రెడ్డి ని గుర్తు చేశారు అనంతరం బాబు పై నిప్పులు చెరగడం మొదలు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన డబ్బులకు లెక్కలు అడగటంతోనే బాబు యూటర్న్ తీసుకున్నారని మోదీ విమర్శించారు. బెయిల్ మీద కోర్టుల చుట్టూ తిరుగుతున్న వాళ్లతో బాబు జతకట్టారని ఎద్దేవా చేశారు. యూటర్న్ బాబు అబద్దాల మీద అబద్దాలు ఆడుతున్నారు. రాజకీయ స్వార్థం కోసం, తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం ఆయన యూటర్న్ తీసుకున్నారని మోదీ విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులకు తన స్టిక్కర్ తగిలించుకుంటున్నారు. ప్రజలంతా యూటర్న్ బాబు, స్టిక్కర్ బాబు అని పిలుచుకుంటున్నారని మోదీ అన్నారు.

ఇక ఆయన చేసిన కొన్ని కార్యక్రమాల గురించి ఏపీకి మంజూరు చేసిన విషయాల గురించి మోదీ మాట్లాడారు. తొలి కేబినెట్‌ భేటీలోనే ఏపీకి ఆయువు పట్టయిన పొలవరం ప్రాజెక్ట్‌కు అనుమతులు మంజూరు చేశామని తెలిపారు. అనంతపురంలో తొలి కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిందెవరు? ఈ చౌకీదారే.. అని ప్రధాని మోదీ తెలిపారు. కర్నూలులో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మంజూరు చేసింది కూడా ఈ చౌకీదారే. కర్నూలు, అనంతపురంలలో మెగా సోలార్ పవర్ పార్క్‌లను ఏర్పాటు చేసింది కూడా మీ చౌకీదారే. విశాఖపట్నంకి సౌత్ కోస్ట్ రైల్వేజోన్ కేటాయించిందెవరు? ఏపీలో తొలి ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీలను మంజూరు చేసిందెవరు? రాష్ట్రంలో తొలి గిరిజన యూనివర్సిటీని మంజూరు చేసిందెవరు? అని ప్రధాని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో మీరు ఓటు వేసి ఆశీర్వదించారు మరోసారి ఓటు వేస్తే మీ సేవకుడిగా పని చేస్తా అంటూ ఆయన సెలవిచ్చారు.

Share.

Comments are closed.

%d bloggers like this: