అవినీతిపరులకి.. కాపలాదారుడు మోదీ-బాబు

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రచారం లో భాగంగా ఏపీ వెళ్ళిన ప్రధాని కర్నూల్ లో చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేశారు.. ఈ విమర్శలకి ఘాటుగా స్పందించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. మోదీ ఒక రోబో అని.. ఆయనకి కుటుంబ విలువలు తెలియవని పేర్కొన్నారు. ,ఒడి చొకీదారు అని పేరు పెట్టుకొని అవినీతి పరుల కాపలాదారులా వ్యవహరిస్తున్నాడని బాబు మోదీ పై ఆరోపణలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు మోదీ పై విమర్శలు చేశారు.

ఆయన మాట్లాడుతూ.. ఏనాడైనా కుటుంబం, అనుబంధాల గురించి తెలిస్తే పిల్లలపై ఉండే వాత్సల్యం కూడా తెలుస్తుంది. “ప్రధానికి ఇష్టంవచ్చినట్టు మాట్లాడడం తప్ప బంధాల గురించి ఏం తెలుసు? ఆయనొక మరమనిషి. విలువలతో కూడిన రాజకీయాలు చేయడం తెలియదు. ఏపీకి ఎంతో చేశామని చెబుతున్నారు, విభజన చట్టంలో ఉన్నవే ఇచ్చారు తప్ప ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదు.

నరేంద్ర మోదీగారూ మా ప్రజలు చెప్పేది వినండి! నేను చెప్పడం కాదు, మా ప్రజల నోటి వెంట వినండి, నేను చేసిన అభివృద్ధి ఏంటో. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ ఐదేళ్ల కాలంలో నాకొచ్చిన ఆనందం ఎప్పుడూ చూడలేదు. మీరు ఢిల్లీలో కానీ, తెలంగాణలో కానీ సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా చేశారా? లేదే! మొన్న ఓ వృద్ధురాలు వేదికపైకి వచ్చి నా పెద్ద కొడుకు వచ్చాడు అంటూ మురిసిపోయింది. వృద్ధుల్లో కూడా ఆత్మవిశ్వాసం కలిగేలా సంక్షేమ పథకాలు తీసుకువచ్చాం, అధికారం, పెత్తనం తప్ప ఇవన్నీ నరేంద్ర మోదీకి అర్థంకావు. ఆయన చౌకీదార్ నంటూ ప్రజలను మోసం చేస్తున్నాడు. అవినీతిపరులకు కాపలాదారుడు. నీతిపరులను వెంటాడే ఈ నరేంద్ర మోదీ ఓ పనికిరాని వ్యక్తి” అంటూ ప్రసంగించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: