నీరవ్ మోదీకి చెక్ పెట్టె దిశలో భారత్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పంజాబ్ నేషనల్ బ్యాంక్ వద్ద భారీగా రుణాలు తీసుకొని బ్రిటన్ కి పరారయ్యాడు నిరవ్ మోదీ. చని చప్పుడు కాకుండా అతని మీద ఎటువంటి అనుమానం రాకముందే స్లోగా ఎస్కేప్ అయ్యాడు. అతను ఎక్కడున్నాడు అని ఇంటెలిజెన్స్ దేశవ్యాప్తంగా గాలించింది ఈలోపే ఆయన బ్రిటన్ కి పరారయ్యాడని తెలిసింది. ఇక ఒక్కసారి మన దేశం నుండి పరారయ్యాదంటే అతనిని పట్టుకోవడం కష్టం. కానీ భారత్ ఈయన విషయం పై ఊరుకొవట్లేదు. తాజాగా నీరవ్ మోదీ ని బ్రిటన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇక భారత్ తగిన చర్యలు చేపట్టి ఈయనకి దాదాపుగా చెక్ పెట్టేసినంత పని చేసింది.

ప్రస్తుతం లండన్ పోలీసుల అదుపులో ఉన్న నీరవ్‌ మోదీ బెయిల్‌ కోసం శుక్రవారం రెండవ సారి వెస్ట్‌మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో పిటషన్‌ దాఖలు చేశాడు. బెయిల్‌ కోసం అతను చేస్తున్న ప్రయత్నాలు పక్కదారి పడుతున్నాయి. ఎలాగైనా బెయిల్‌ పొందాలని అక్కడి ప్రత్యక్ష సాక్షిని బెదిరింపులకు గురిచేసి, తనకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించాడని భారత్‌ తరఫు న్యాయవాది నేరుగా కోర్టు ద్రుష్టికి తెచ్చారు. ఆశీష్ లాడ్ అనే ప్రత్యక్ష సాక్షిని పిలిచి, చంపేస్తానని బెదిరింపులకు దిగాడని పేర్కొన్నారు. తప్పుడు సాక్ష్యం చెబితే రూ.20 లక్షల ముడుపులు ఇచ్చేందుకు కూడా సిద్ద పడ్డారన్నారు. నీరవ్‌ మోదీకి ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్‌ మంజూరు చేయవద్దని న్యాయస్థానాన్ని కోరినట్లు సమాచారం.

దీంతో నీరవ్‌ మోదీ బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. నీరవ్ మోదీ జీవితం రిస్కుల్లో పడిందని, ఆయన తన వద్ద సొమ్ముతో దేశం విడిచి పారిపోయే అవకాశం ఉన్నదని చీఫ్ మేజిస్ట్రేట్ చెప్పారు. నీరవ్ మోదీ బెయిల్ కోసం చేసిన దరఖాస్తులో 10 లక్షల యూరోలు వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వడానికి సిద్దమని పేర్కొన్నారు. కానీ ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు సదరు సొమ్ము సరిపోదన్నారు. బిలియన్ డాలర్ల పూచీకత్తు పెట్టినా సరిపోకపోవచ్చుఅన్నారు. నీరవ్ మోదీ కేసు ప్రాథమిక దశలో ఉన్నదని, పూర్తిగా పరిశీలించాల్సి ఉన్నదన్నారు. నీరవ్‌ను భారత్‌కు రప్పించేందుకు తగిన ఆధారాలను చూపించడానికి ఇప్పటికే సీబీఐ, ఈడీ అధికారుల బృందం మార్చి 28న లండన్‌కు చేరుకుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: