రోకలు.. కల్వం..! బెండ.. చిక్కుడు.. ఇవి గుర్తులు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

గత కొంత కాలంగా నిజామాబాద్ లోని ఎర్రజొన్న, ఉల్లిగడ్డ, పసుపు రైతులు వారికి గిట్టుబాటు ధర రావడం లేదని నిరసనలు వెల్లువెత్తుతున్నారు.. వాళ్ళు ఎన్ని నిరసనలు చేసినా ఆ నిరసనలకి తెలంగాణ ప్రభుత్వం నుండి సరైన స్పందన రాకపోవడం తో ఈసారి వారి నిరసనాలని కేంద్రం కి తీసుకెళ్లాలని భావించారు అక్కడి రైతులు. దానికి గాను వారు జరగనున్న లోక్‌సభ ఎన్నికలకి నిజామాబాద్ తరఫున నామినేషన్లు వేయాలని నిశ్చయించుకున్నారు. మునుపు దాదాపుగా 247 మంది రైతులు ప్రధాన పార్టీలకీ వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గా నామినేషన్లు వేశారు.. కాగా వారిలో కొంత మంది వివరాలు సరిగ్గా రాయక మరి కొందరు నిష్క్రమించుకొని అలా ఇప్పుడు ఆ సంఖ్య 178 కి చేరింది. కేవలం నిజామాబాద్ నుండే దాదాపుగా 185 మంది వరకు పోటీకి దిగారు.

ఇక ఒకేసారి 185 పోటీ చేయడంతో ఎన్నికల అధికారులకి కూడా ఈడూ టాస్క్ అనే చెప్పాలి. ఇక 185 మందికి గుర్తులు సమకూర్చాలి. ఇక 185 మందిని ఈ‌వీఎం మిషన్ కూడా సపోర్ట్ చేయదు.. దింటూ ఇప్పుడు వారికి ఇదో టాస్క్ లాగా మారింది. వారు తగిన కసరత్తులు తీసుకొని ఈసారి నిజామాబాద్ లో జరగబోయే ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులు ఉపయోగించాలి అనే నిర్ణయానికి వచ్చారు. ఇక ఈసారి నిజామాబాద్ లో బ్యాలెట్ బాక్సులని ఉపయోగిస్తునట్టు అధికారులు ఇది వరకే ప్రకటించారు. ఇక పోతే అధికారులకి మరో టాస్క్ అభ్యర్థుల గుర్తులు..! ఇక దీనిపై అధికారులు కలెక్టర్లు కూర్చొని కసరత్తులు క్వ్వ్హెసి ఒక నిర్ణయానికి వచ్చారు అదేంటంటే.. 185 మందికి గుర్తులంటే కష్టం కాబట్టి వచ్చిన రైతులకి వారు పండించే కూరగాయల గుర్తుని కేటాయించారు.

కూరగాయలు, పండ్లతో పాటూ వింత, వింత గుర్తులు కేటాయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాదండోయ్ ఎలక్ట్రానిక్‌ వస్తువులు, పాత కాలం నాటి కల్వం (చిన్న సైజురోలు), రోకలి, ఇసుర్రాయి.. ఇలా పాత గుర్తులను కూడా తవ్వి బయటకు తీశారట. చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు, వంటపాత్రల్ని కూడా అభ్యర్థులకు గుర్తులుగా మార్చారట. ఉదాహరణకు.. బెండకాయ, గోబిపువ్వు, బెంగుళూరు మిర్చి, అల్లం, పచ్చి మిరప, చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్‌క్రీం, కేకు, బఠానీలు, నూడుల్స్, రొట్టే, పళ్లెం, ద్రాక్ష గుత్తి, సెల్‌ఫోన్‌ చార్జర్, ల్యాప్‌టాప్, కంప్యూటర్, మౌస్, పెన్‌డ్రైవ్, వాటర్‌ హీటర్, స్విచ్‌ బోర్డు, రిమోట్, బ్రెడ్‌ టోస్టర్, టార్చ్‌లైట్, సీసీటీవీ కెమెరా వంటివి కూడా ఉన్నాయట.

Share.

Comments are closed.

%d bloggers like this: