షర్మిల పంచ్..! లోకేష్ కౌంటర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ సోదరి వైఎస్ షర్మిల నిన్నటి నుండి తన అన్న జగన్ గెలుపు కొరకు ప్రచారంలో పాల్గొంటుంది. బస్సు యాత్ర అంటూ ప్రచారం లో దిగిన షర్మిల నిన్న మంగళగిరి లో రోడ్ షో నిర్వహించింది. రోడ్ షో లో భాగంగా ఆమె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై లోకేశ్ పై విమర్శలు చేసింది. టీడీపీ పార్టీని ఉద్దేశిస్తూ పంచ్ డైలాగ్స్ వేస్తూ ప్రసంగించింది.

ఆమె మాట్లాడుతూ.. సింహం సింగిల్‌గా వస్తుందని.. వైసీపీ సింగిల్‌గా వచ్చినా బంపర్ మెజార్టీతో గెలుస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. వైసీపీకి ఎవరితోను పొత్తు పెట్టుకునే అవసరం లేదన్నారు. పొరపాటున ప్రజలు చంద్రబాబును గెలిపిస్తే రాష్ట్రం నాశనమవుతుందన్నారు. జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ఇక షర్మిల వ్యాఖ్యాలకి స్పందించారు లోకేశ్.. ఆయన తన ట్వీట్టర్ ద్వారా ట్వీట్ చేస్తూ వ్యంగ్యం గా విమర్శలు చేశారు.

కర్నూలులో నిన్న జరిగిన ప్రధాని మోదీ సభలో కొందరు వ్యక్తులు వైసీపీ జెండాలతో కనిపించారు. ఇక ఈ విషయానిపై స్పందిస్తూ.. ‘అబ్బబ్బబా! పైకి బీజేపీతో ‘పొత్తు నహీ’ అంటారు, జనాలు రాని బీజేపీ సభకి తమ కార్యకర్తలని పంపించి ‘హమ్ హై నా’ అని భరోసా ఇస్తారు.. అంటూ ఆయన వ్యంగ్యంగా వింర్శించారు. ఇక షర్మిలకి కౌంటర్ ఇస్తూ.. సింహం సింగల్ అంటూ పెద్ద పెద్ద సినిమా డైలాగులు ! జనాలు మీ ‘సింహం’ కామెడీ చూసి నవ్వుకుంటున్నారు’అని ఆయన అన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: