గర్వం, స్వార్ధం లేని వ్యక్తి..! ఆయన నా స్పూర్తి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కొణిదెల నీహారిక నటించిన సినిమా సూర్యకాంతం నేడే విడుదల అయ్యింది.ఇక ఈ సంధర్భంగా నీహారిక ఓ ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యారు.. అక్కడ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావన వస్తే.. ఆమె మాట్లాడుతూ.. బాబాయ్ అస్సలు ఎక్కువగా మాట్లాడరు, చాలా కామ్ గా ఉంటారు. సంధార్భాన్ని బట్టి ఆట్లాడుతారు.. ఎప్పుడూ కామ్ గా ఉన్నప్పటికీ ఏదైనా ఫంక్షన్ కి వస్తే మాత్రం చాలా సందడి చేస్తారు. ఆయన అప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటారు.

మేము ఏదైనా తప్పు చేస్తే సరిదిద్దుతాడు.. కొంటె పనులు చేస్తే ఆట పట్టిస్తాడు. అలాంటి బాబాయ్ జనం లోకి వచ్చి సభలు పెట్టి ప్రసంగాలలో మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన ప్రసంగాలు చాలా ఎనర్జీటిక్ గా స్పూర్తినిచ్చే విదంగా ఉంటాయి. మా బాబాయ్ ప్రసంగాలే నాకు స్పూర్తి. కానీ ఈ విషయాన్ని ఆయనతో ఎప్పుడూ చెప్పలేదు. నాకు తెలిసిన నేను చూసిన రాజకేయాల్లో మా బాబాయ్ కంటే ఎవ్వరూ స్వచ్ఛంగా లేరు. ఆయనకంటే స్వచ్చమైన వ్యక్తి మ్మరొకరు ఉండరు. ఒక పెద్ద స్టార్ ని అనే గర్వం స్వార్ధం ఆయనలో లేవు అని ఆమె అన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: