తెలంగాణలో లోక్సభ ఎన్నికలు దేగ్గర పడుతున్నాయి. కేసీఆర్ ఒక దిక్కు సభలు పెడుతుంటే కేటీఆర్ హరీష్ లు మరో చోట సభలు పెడుతున్నారు.. తమ ప్రసంగాలతో పార్టీ అభ్యర్థులని బలోపేతం చేస్తున్నారు. స్టార్ కెంపెయినర్లు మరో వైపు ప్రచారాలు చేస్తున్నారు. ఇక విరీ సభల్లో ప్రతిపక్షాలని ఉద్దేశిస్తూ ముఖ్యంగా ప్రధాని మోదిని ఉద్దేశిస్తూ తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ములుగు లో నిర్వహించిన సభకి హాజరయ్యారు.
ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లు అధికారంలో ఉన్న మోదీ చేసిన ఒకే ఒక్క పని, నోట్ల రద్దుతో సామాన్యలు నోట్లో మట్టి కొట్టడమేనని ఆయన అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 71 ఏళ్లు పూర్తవుతోందని కానీ కాంగ్రెస్, బీజేపీలు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కుంభకోణాలపై ఒకదానిపై మరొకటి ఆరోపణలు చేసుకోవడం తప్ప దేశంలోని ప్రధాన సమస్యలను పట్టించుకున్నది లేదని మండిపడ్డారు.
బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అంతపెద్దవేమీ కాదు.. ప్రాంతీయ పార్టీల కన్నా కాస్త పెద్దవి. మొత్తం దక్షిణ భారతదేశం లో 130 లోక్సభ స్థానాలు ఉంటే వాటిలో 10 కూడా గెలవలేని పార్టీలని ప్రధానా పార్టీలు జాతీయ పార్టీలంతారా అని ఆయన ప్రశ్నించాడు. జాతీయ పార్టీలు మనకి చేసిందేమి లేదు ప్రాంతీయ పార్టీలతోనే అభివృద్ది సాధ్యం అని కేటీఆర్ అన్నారు.