పవన్.. మోదీ.. జగన్.. కేసీఆర్..! అందరినీ ఏకీపారేసిన బాబు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నికలు దేగ్గర పడుతుండటంతో ప్రచారాల స్పీడ్ పెంచారు టీడీపీ అధినేత చంద్రబాబు. నేడు శ్రీకాకుళం జిల్లా రాజాం ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రసంగించారు.. వ్యంగ్యాస్త్రాలని ప్రతిపక్షాల పై గుప్పించారు. ధీటు వ్యాఖ్యలు చేశారు ప్రతిపక్షాలు అయిన వైసీపీ అధినేత జగన్ ని జనసేన అధినేత పవన్ ని హెచ్చరించారు.. ఇక పక్క రాష్ట్రం సీఎం కేసీఆర్ పై దేశ ప్రధాని మోడి పై వ్యంగ్యపు విమర్శలు చేశారు. ఒక మాటన చెప్పాలంటే అందరినీ ఏకీపారేశారు.

చంద్రబాబు తన మేనిఫెస్టో కి సంభందించిన కొన్ని అంశాలను చెబుతూనే ప్రతిపక్షాలపై దుయ్యబడ్డారు. . రాష్ట్రాభివృద్ధికి సంబంధించి తన వద్ద అనేక ఆలోచనలు ఉన్నాయని, రాష్ట్రంలో సంపద సృష్టించి.. ఆదాయం పెంచుతానని హామీ ఇచ్చారు. పెరిగిన ఆదాయాన్ని తిరిగి ప్రజలకే ఇస్తానని చెప్పారు. రైతు కష్టం తెలిసిన వ్యక్తిని కాబట్టే రుణమాఫీ చేశానని చెప్పారు. భవిష్యత్తులో రాజాంలో రూ.150కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించడంతో పాటు.. పట్టణాన్ని అన్నివిధాలుగా అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు.

ఇక వైసీపీ అధినేత జగన్ గురించి మాట్లాడుతూ.. వైసీపీకి ఓటేస్తే.. వీధివీధికి ఒక రౌడీ తయారువుతాడని.. నేరస్తులను అందలమెక్కిస్తే రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని అన్నారు. కోడికత్తి పార్టీ అధినేత కేసుల్లో చిక్కుకుని కేసీఆర్, మోదీలకు బానిసగా మారాడని ఎద్దేవా చేశారు. “కేసీఆర్ డ్యాన్ చేయమన్నా చేస్తాడు, ఆడమంటే ఆడతాడు, ఎగరమంటే ఎగురుతాడు, బాంచన్ నీ కాల్మొక్తా అంటాడు” అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

కేసీఆర్ మోడి ల గురించి మాట్లాడుతూ.. రాష్ట్రానికి హోదా ఇస్తానని చెప్పి.. ఇచ్చిన మాట తప్పిన వ్యక్తి మోదీ అని ఆరోపించారు. మోదీ, కేసీఆర్ కలిసి రాష్ట్రంపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రులతో పెట్టుకుంటే తమ పౌరుషం ఎలా ఉంటుందో చూపిస్తామని హెచ్చరించారు.

ఇక పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకి బాబు స్పందించారు, బాబు మాట్లాడుతూ.. తన సైకిల్ చైన్ ను కేసీఆర్ ఎప్పుడో తెంపేశాడని పవన్ వ్యాఖ్యానిస్తున్నారని, కానీ తనది మామూలు సైకిల్ కాదన్న విషయం తెలుసుకోవాలని హెచ్చరించారు. అంతేకాదు, తన సైకిల్ చైన్ ను దమ్ముంటే పట్టుకుని చూడాలని సవాల్ విసిరారు.

“నా సైకిల్ చైన్ దగ్గరకొస్తే షాక్ కొట్టి అక్కడే ఫినిష్ అయిపోతారు, అడ్రసే ఉండదు. ఇది మామూలు సైకిల్ కాదు, ఎంత అవసరమైతే అంత జోరు పెరుగుతుంది. అవినీతిపరులు, దొంగలు ఎదురొచ్చినా వెనక్కు వెళ్లదీ సైకిల్” అంటూ అభిమానులను, కార్యకర్తలను ఉర్రూతలూగించేలా మాట్లాడారు.

Share.

Comments are closed.

%d bloggers like this: