సార్.. రూ.5వేల జరిమానా కట్టాలి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కంటోన్మెంట్ ప్రాంతానికి వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డికి తిరుమలగిరి పోలీసులు చిన్న షాక్‌ ఇచ్చారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను మీరు ప్రయాణిస్తున్న కారుపై జరిమానా చలానాలు ఉన్నాయని, వాటిని చెల్లించాలంటూ తెలపడంతో రేవంత్‌ ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళితే…

ఎన్నికల ప్రచారంలో భాగంగా కంటోన్మెంట్‌ ప్రాంతాన్ని సందర్శించిన రేవంత్‌రెడ్డి తాడ్‌బండ్‌లోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి నుంచి న్యూబోయిన్‌పల్లి వెళ్లే క్రమంలో తాడ్‌బండ్ చౌరస్తాలో సిగ్నల్ పడటంతో రేవంత్‌రెడ్డి కాన్వాయ్ ఆగింది. ఆ సమయానికి అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు రేవంత్‌ వెళ్తున్న కారు నంబర్‌పై ఉన్న జరిమానా చలానాలను పరిశీలించారు. సైదాబాద్, రాజేంద్రనగర్‌లో ఓవర్ స్పీడ్, రాంగ్ పార్కింగ్ చేసినందుకు రూ.5వేల చలానాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కారు వద్దకు వెళ్లి విషయం రేవంత్‌రెడ్డికి చెప్పగా వెంటనే స్పందించి చలానాలు చెల్లించేశారు

Share.

Comments are closed.

%d bloggers like this: