టీడీపీపై వైసీపీ దాడి..చంద్రగిరిలో హై టెన్షన్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా చంద్రగిరిలో అర్థరాత్రి వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ దాడిలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు గాయపడ్డారు.

పనపాకం హరిజనవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ చినికి చినికి గాలివానగా మారింది. ఈ ఘర్షణలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు గాయపడ్డారు. వెంటనే వారిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రగిరి ఎమ్మెల్యేగా వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గల్లా అరుణపై ఆయన గెలుపొందారు. వరుసగా 1999, 2004,2009 ఎన్నికల్లో విజయం సాధించిన గల్లా అరుణను ఓడించి చెవిరెడ్డి చంద్రగిరి కోటపై వైసీపీ జెండా ఎగరేశారు. అయితే ఇక్కడ గతకొంతకాలంగా టీడీపీ, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. దీనికితోడు శనివారం అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవ దీనికి మరింత ఆజ్యం పోసినట్టైంది.

Share.

Comments are closed.

%d bloggers like this: