సహజీవనం..రూ.1.50 లక్షలు..ప్రేయసికి పంగనామాలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పెళ్లి చేసుకుంటానని నమ్మించి..ఐదు సంవత్సరాలకు పైగా సహజీవనం చేసి..అవసరాలకు డబ్బులు తీసుకోని. చివరకు మోసం చేసిన ప్రేమికుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది ఓ యువతి. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే…

ఉన్నత విద్యను అభ్యసించేందుకు 2010లో హైదరాబాద్ వచ్చిన మోహన్ కుమార్ అనే యువకుడితో చిక్కడపల్లిలోని ఓ మహిళా కళాశాలలో చదువుకుంటున్న నర్మద అనే యువతికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి, ఆపై ప్రేమగా మారింది. ప్రేమ మత్తులో మునిగిపోయిన సదరు యువతి మోహన్ కుమార్ చదువు కోసం రూ. 1.50 లక్షలు ఇచ్చింది. 2014లో చదువు పూర్తయిన క్రమంలో నర్మద తల్లిదండ్రులకు ఫోన్ చేసిన మోహన్ పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. తామిద్దరం పెళ్లి చేసుకుంటామని, మరో సంబంధం చూడవద్దని చెప్పాడు.
ఆపై ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరాడు. తనను పెళ్లి చేసుకోవాలని నర్మద కోరగా, చెల్లి పెళ్లి తరువాత చేసుకుందామని నమ్మించి, దాదాపు ఐదు సంవత్సరాలుగా సహజీవనం చేశాడు. అయితే చెల్లి పెళ్లి తరువాత, తన తల్లి ఒప్పుకోవడం లేదని, పెళ్లి చేసుకోలేనని చెబుతూ, నర్మదను దూరం పెట్టసాగాడు. తాను మోసపోయానని గ్రహించిన నర్మద, పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడ న్యాయం జరగకపోవడంతో, ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఆమెకు మహిళా సంఘాలు మద్దతు పలుకుతున్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: