ఈ సారి ‘ఆర్‌డీఎక్స్’ అంటున్న పాయల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆర్ఎక్స్ 100 సినిమాతో కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టిన పాయల్ రాజ్‌పుత్‌ తొలి చిత్రంతోనే బాగా పాపులర్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ అమ్మ‌డు ఇటు తెలుగు, అటు త‌మిళ సినిమాల‌ని సెల‌క్టివ్‌గా ఎంపిక చేసుకుంటుంది. డిస్కోరాజా చిత్రంలో ర‌వితేజ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించ‌నున్న ఈ అమ్మ‌డు వెంకీ మామ‌లో వెంక‌టేష్‌తో జోడీ క‌ట్టింది.

అలాగే ఇప్పుడు మరో సినిమాను పట్టాలెక్కించింది. సి.కె.ఎంటర్‌టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై ‘ఆర్‌డీఎక్స్’ అనే సినిమాను సి.కళ్యాణ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ‘ఆవ‌కాయ బిర్యానీ’, ‘హుషారు’ చిత్రాల్లో న‌టించి మెప్పించిన తేజ‌స్ హీరోగా న‌టిస్తున్నారు. శంకర్ భాను దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ఆదివారం విజయవాడలోని కె.ఎల్.యూనివర్సిటీలో లాంఛనంగా ప్రారంభమైంది. చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజ‌య‌వాడ అర్బన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బుద్ధా వెంక‌న్న, ఆంధ‌ప్రదేశ్ ఎఫ్‌డీసీ చైర్మన్ అంబికా కృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

కాగా, ఈ చిత్రంలో నరేష్ వీకే, నాగినీడు, ఆదిత్య మీనన్, ఆమని, తులసి, ఐశ్వర్య, విద్యుల్లేఖ రామన్, చమ్మక్ చంద్ర, సత్తిపండు, జెమిని సురేష్, సత్యశ్రీ, జోయ, దేవీశ్రీ, సాహితి నటిస్తున్నారు. రథన్ సంగీతం సమకూరుస్తున్నారు. భాస్కరభట్ల, కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందిస్తున్నారు. సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం శంకర్ భాను.

Share.

Comments are closed.

%d bloggers like this: