దొంగా..దొంగా ..ఏకంగా షర్మిల రింగునే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వైసీపీ అధినేత, వైఎస్ జగన్ సోదరి షర్మిల తనదైన శైలిలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన పుత్రుడు నారా లోకేశ్ టార్గెట్‌గా ఆమె ప్రసంగిస్తున్నారు. అయితే గుంటూరు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షర్మిలకు ఒక చేదు అనుభవం ఎదురైంది. అదేంటంటే అభిమానులకు, కార్యకర్తలకు ఆమె బస్సులోంచి అభివాదం చేస్తున్నారు. ఈ సమయంలో అందరూ చూస్తుంగానే షర్మిల చేతి ఉంగరాన్ని లాగేందుకు ఒక దొంగ ప్రయత్నించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆమె చేతిని వెనక్కి లాగేశారు. నాయకుల ప్రచారానికి హాజరయ్యే జనం అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: