లేటు వయసులో డేటింగ్…రూ.46 లక్షలు స్వాహా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

లేటు వయసులో డేటింగ్‌కు ఆశపడ్డ ఓ 65 ఏళ్ల వృద్ధుడు ఒక యువతి చేతిలో ఏకంగా రూ.46 లక్షలు మోసపోయాడు. తనకు వచ్చిన పదవీ విరమణ సొమ్మంతా ఇలా పోగొట్టుకున్నానని ఇప్పుడు వాపోతున్నాడు. ఈ ఘరానా మోసం న్యూఢిల్లీలో జరిగింది.

న్యూఢిల్లీకి చెందిన వృద్ధుడు, ఓ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోగా, తొలుత మీరా అనే యువతి నుంచి ఫోన్ వచ్చింది. ప్రీమియం మెంబర్‌గా రిజిస్టర్ కావాలని కోరింది. దీంతో ఆ పని చేశాడు. ఇందుకోసం కొంత మొత్తం సొమ్ముకూడా చెల్లించాడు. ఆపై ముగ్గురు మహిళల ఫొటోలను పంపగా, ఒకరిని ఎంచుకున్నాడు. ఆమెతో ఏడాది డేటింగ్ చేసేందుకు రూ. 10 లక్షలు కట్టాలని చెబితే, ఆశతో ఆ డబ్బు కట్టాడు. ఆపై తాను ఎంపిక చేసుకున్న మహిళ రోజీ అగర్వాల్ నుంచి ఫోన్ వచ్చింది. ఆమె కూడా సాకులు చెబుతూ భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసింది. అడిగినప్పుడల్లా డబ్బు పంపుతున్నా, ఆమె డేటింగ్ కు రాలేదు.

ఆపై తాను మోసపోయానని గ్రహించి.. తన పేరును రిజిస్టర్ చేసుకున్న వెబ్‌సైట్‌ను పరిశీలించాడు. అది మోసపూరిత వెబ్‌సైట్ అని తేలింది. దీంతో పరువు పోతుందని భావించిన ఆయన కొన్ని నెలల పాటు మౌనంగా ఉండి, చివరకు కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో, వారు పోలీసులను ఆశ్రయించారు. జరిగిన మోసంపై కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ ప్రారంభించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: