యాంకర్ శ్యామల పోలిటికల్ ఎంట్రీ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సార్వత్రిక ఎన్నికలవేళ వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. టాలీవుడ్ నుంచి ప్రముఖులు ఒక్కొక్కరుగా పార్టీలో చేరుతున్నారు. తాజాగా యాంకర్, నటి శ్యామల.. ఆమె భర్త నర్సింహారెడ్డితో కలిసి హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో జగన్‌ను కలిసి మద్దతు తెలిపారు. పార్టీ కండువా కప్పి జగన్ సాదరంగా వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ కుటుంబంలో కలిసినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. జగన్ విధానాలు నచ్చి పార్టీలో జాయిన్ అయినట్లు శ్యామల వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయనున్నట్లు ప్రకటించారు. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. జగన్ నెక్ట్స్ సీఎం కావటం ఖాయమని జోస్యం చెప్పారు. రాజకీయాల్లోనూ చురకైన పాత్ర పోషిస్తానని చెప్పుకొచ్చారు.

Share.

Comments are closed.

%d bloggers like this: