నేడు జగన్ విరామం..? కారణం ఏంటి..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల జోరు పెరిగిపోతుంది. అధినేతలు మెరుపు ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా సగం రాష్ట్రానికి పైనే తిరిగేశారు. గెలుపే లక్ష్యంగా అధినేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. విశ్రాంతికి కూడా ప్రత్యేక సమయాన్ని కేటాయించుకోడం లేదు రోజంతా బిజీ షెడ్యూల్..! ప్రచారం విషయం లోనూ ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారు. తమ కుటుంభ సభ్యులు.. అవతలి రాష్ట్రం నేతలు పార్టీ అధినేతలు ఏకంగా ముఖ్యమంత్రులు సైతం ఆంధ్రప్రదేశ్ కి వచ్చి తమ మద్దత్తుని తెలుపుతున్నారు..ప్రజలని ఓటేయమని అడుగుతున్నారు. ఇక పోతే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీనికి అనుగూనంగా నేడు ఆయన ప్రచారానికి బ్రేక్ తీసుకున్నారు.

అసలెందుకు తీసుకున్నారా అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఆయన రానున్న ఎన్నికల విషయమై తమ వ్యూహాలాని పార్టీ నేతలతో చేర్చించాలని జగన్ భావించారు. ఇకపై జరిపే ప్రచారం ఎలా చేయాలి అనే విషయాలపై ఆయన పార్టీ నేతలతో వివరించనున్నారు. ఈ విషయమై నేడు ఆయన హైదరబాద్ లో సమావేశం ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం ప్రచారం ముగించుకొని జగన్ తిరిగి హైదరాబాద్ లోటస్‌పాండ్‌కు చేరుకున్నారు. జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. దీనితో పాటు ఇప్పటి వరకు జరిపిన ప్రచార సరళిపై ఆయన పార్టీ నేతలు మంతనాలు జరపనున్నారు సరికొత్త వ్యూహంతో ప్రజల ముందుకు వెళ్లి.. అధికారం చేజిక్కుంచుకోవాలని ఆయన వ్యూహాలు రచిస్తున్నారని ఆయన పార్టీ నేతలు చెబుతున్నారు.

జగన్ తిరిగి బుధవారం నాడు మళ్ళీ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. . 3వ తేదీన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు గుంటూరు జిల్లా సత్తెనపల్లి, 11.30 గంటలకు గురజాల, మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రకాశం జిల్లా ఒంగోలు, మధ్యాహ్నం 3.30 గంటలకు కృష్ణా జిల్లాలోని మైలవరంలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో జగన్‌ ప్రసంగిస్తారు.

Share.

Comments are closed.

%d bloggers like this: