ఎలక్షన్ కింగ్..! 170 పోటీలు నాటౌట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నికల్లో పోటి చేయడమే పెద్ద టాస్క్. ఇక గెలుపు ఓటములు ప్రజలు తెలుస్తారు..! సాధారణంగా వార్డ్ మెంబర్ ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే చాలా ఖర్చు అవుతుంది. ఇక ఓడిపోతే పరువు పోతుంది డబ్బు పోతుంది. ఎవ్వరైనా ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే 2 సార్లు మహా ఐతే మూడు సార్లు పోటీ చేస్తారు. కానీ ఒక వ్యక్తి ఎన్నిసార్లు ఓటమి ఎదురైనప్పటికీ ఓటమికి పోటీగా ఎదురీదుతూనే ఉన్నాడు అలా ఈ వ్యక్తి 170 సార్లు ఎన్నికల భరిలో దిగుతునే ఉన్నాడు. దీనికి గాను ఆయన ఎంత ఖర్చు చేశాడో అది ఆయనకే తెలుసు. 170 సార్లు పోటీ చేసి ప్రతీసారి ఓడిపోతునే వస్తున్నాడు. ఆయనే డాక్టర్ కె. పద్మరాజన్.

డాక్టర్ కె పద్మరాజన్ ఒక హోమియో వైద్యుడు. తమిళనాడు సేలంకి చెందిన ఈ వైద్యుడు 1988 నుండి ఇప్పటివరకూ మొత్తం 170 సార్లు ఎన్నికల్లో పోటీ చేశాడు. స్టానిక వార్డ్ మెంబర్ ఎన్నికల నుండి రాష్ట్రపతి ఎన్నికల వరకూ అన్నిత్ర్లో పోటీ చేస్తూనే ఉన్నాడు. రాజకీయ ప్రముఖులు అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ, ఏపీజే అబ్దుల్ కలాం, జయలలిత, కరుణానిధి వంటి హేమాహేమీల తోనూ పోటీ చేశాడు.. ఇలా వీరందరి మీద పోటీ చేస్తూ ఇప్పటికీ ఆయన పోటీ చేస్తూనే ఉన్నాడు. ఇక పోటీ చేసిన ప్రతీసారి ఈయన ఓడిపోతునే ఉన్నాడు. దీన్ని గమనించిన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ యాజమాన్యం ఈయనకి “మోస్ట్ అన్‌సక్సెస్‌ఫుల్ క్యాండిడేట్” బిరుదు ఇచ్చి ఈయన పేరుని రికార్డ్ బుక్ లో ప్రతిపాదించారు. లిమ్కా బుక్ ఈయనకి అన్‌సక్సెస్‌ఫుల్ బిరుదుని ఇచ్చినా ఈయన మాత్రం తనకు తాను ఎలక్షన్ కింగ్ టైటిల్ పెట్టేసుకున్నాడు.

k padmarajan contesting for 170th time in this elections

Share.

Comments are closed.

%d bloggers like this: