మోహన్ బాబుకి జైలు శిక్ష జరిమానా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ నటుడు, నిర్మాత.. మంచు మోహన్ బాబు కి మంగళవారం నాడు ఎర్రమంజిల్ కోర్టు ఏడాది జైలు శిక్షని విధించింది. పైగా రు. 41.75 లక్షల జరిమానా విధించింది ఒకవేళ మోహన్ బాబు ఆ జరిమానా ని కట్టకపోతే మరో మూడు మాసాల జైలు శిక్షని విధించింది. 2010 లో మోహన్ బాబు పై చెక్ బౌన్స్ కేసు నమోదయ్యింది, నేడు ఆ కేసు బెంచ్ మీదికి రావడం తో జస్టిస్ వీ. రఘునాథ రావు తీర్పుని వెల్లడించాడు.

వివరాల్లోకి వెళితే.. 2010 లో దర్శకుడు వైవీఎస్ చౌదరి మోహన్ బాబు పై లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పై కేసు చెక్ బౌన్స్ కేసు నమోదు చేశాడు. ఆయనకి రావలసిన 48 లక్షల గురించి ఆయనకి ఇచ్చిన చెక్ బ్యాంక్ లో వేస్తే అధి బౌన్స్ అయ్యింది. దర్శకుడు మోహన్ బబ్బు ని లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ ని పదే పదే అడగగా వారి నుండి సరైన సమాధానం రాకపోవడం తో ఆయన కేసు నమోదు చేశాడు. ఆ కేసు లో ఏ1 గా లక్ష్మి ప్రసన్న పిక్చర్స్, ఏ2 గా మోహన్ బాబు ఉన్నారు. ఇక ఆ కేసు ఇప్పుడు బెంచ్ మీదికి రావడం తో సంవత్సరం జైలు శిక్ష ని ఇవ్వాల్సిన 48 లక్షలకి 41.75 ఇవ్వాలంటూ కోర్టు తీర్పునిచ్చింది. ఇక మోహన్ బాబు ఈ కేసు గురించి బెయిల్ అడుగుతూ పిటిషన్ దాఖలు చేశాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: