టాస్క్ ఫోర్స్ పోలీసుల పేరిట.. 1.75 కోట్లు స్వాహా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

విజయవాడలో హైదరబాద్ కి చెందిన వ్యాపారి అభినవ్ రెడ్డి దేగ్గర నుండి దుండగులు టాస్క్ ఫోర్స్ పోలీసులమని చెప్పి దాదాపుగా కోటి 70 లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళితే అభినవ్ రెడ్డి హైదరబాద్ లో ఉంటాడు. ఆయన వ్యాపారమంతా విజయవాడలోనే.. అయితే విజయవాడ లో అభినవ్ రెడ్డి కి నాగరాజు అనే వ్యక్తి సహాయపడుతుంటాడు. నాగరాజు విజయవాడలో డబ్బు వసూళ్లు చేసి అభినవ్ రెడ్డి కి పంపిస్తాడు.. నాగరాజు మిత్రుడు నాని.. నాగరాజు నాని ఇద్దరూ అభినవ్ కి సహాయ పాడేవారు. డబ్బు వసూలు చేసి హైదరబాద్ కి పంపేవారు.

లెక్కల్లో లేని డబ్బు కాబట్టి నాని ఆ డబ్బంతా కొట్టేద్దామని ప్లాన్ చేశాడు.. కొందరు స్నేహితులతో కలిసి నాగరాజుకి తెలియకుండా డెకాయిట్ ఆపరెషన్ ప్లాన్ చేశాడు. డబ్బుతో ఓ హోటల్ కి వెళుతున్న సమయంలో అడ్డగించి టాస్క్ ఫోర్స్ పొలీసులమని చెప్పి ఆ దబ్బన్తా కొట్టేశారు. హోటల్ దాచిన మరో 40 లక్షలు నాని బయటకి తీసుకెళుతున్న సమయంలో నాగరాజు అడ్డుకొని అడిగాడు.. ఉన్న దబ్బన్తా ఎలాగో పోయింది ఈ 40 లక్షలని ఇద్దరం పంచుకుందాం అని నాని నగరాజుని ఒప్పించాడు. దబ్బన్తా తీసుకొని ఇద్దరు పరారయ్యారు.

వ్యాపారి అభినవ్ ఎంత సంప్రదిద్దాము అని చూసినప్పటికీ నాని నాగరాజు ఆచూకీ తెలియక అభినవ్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోలీసులు అభినవ్ నీ డబ్బు గురించి అడగగా సరైన లెక్కలు చూపించలేకపోయాడు. ముందే ఇది ఎన్నికల సమయం ఇక పోలీసులకి రాజకీయంగా తరలిస్తున్న డాబా..? మని లాండరింగ్ హవాలా వల్ల వచ్చిన డబ్బా..? తెలియక వెంటనే ఈడీకి ,ఐటి కి సమాచారం ఇచ్చారు. పోలీసుల విచారణలో భాగంగా ఇప్పటి వరకు 1.26 కోట్లని రికవరీ చేశారు 5 మందిని అరెస్ట్ చేసి అదుపులు పెట్టారు ఇంకా కూడా విచారణ కొనసాగుతుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: