ఆంధ్రప్రదేశ్ లో జనసేన, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం లు పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. ఈ సంధర్భంగా తమ కూటమిని బలపరచడానికి బీఎస్పీ అధినేత మాయావతి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కి వచ్చారు. ఆమెని సాధరంగా విమానాశ్రయానికి వెళ్ళి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ తో కలిసి మాయావతి మీడియాతో మాట్లాడారు..
ఆమె మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు. దీంతో విభజన డిమాండ్ మొదలైంది. అభివృద్ధి చేసి ఉంటే ఏపీ విభజన జరిగి ఉండేది కాదని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ లో ఎన్నికలు జరగనున్నాయి.. ప్రజలు కొత్త తరం నాయకులని కోరుకుంటున్నారు అని ఆమె అన్నారు. ప్రత్యేక హోదా పై పవన్ పోరాటం చేశారని ఆమె గుర్తు చేశారు. . ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హామీని బీజేపీ అమలు చేయలేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్, బీజేపీలు ఏపీ ప్రజలను మోసం చేశాయని ఆమె విమర్శించారు. పవన్ కల్యాణ్ సమర్ధవంతమైన నాయకూడని ఏపీలో తమ కూటమి అధికారాన్ని కైవసం చేసుకొంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తమ కూటమి అధికారం లోకి వస్తే పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని ఆమె ప్రకటించారు.
ఇక పవన్ మాట్లాడుతూ.. 2014లో అప్పుడున్న పరిస్థితుల కారణంగా టీడీపీ, బీజేపీల కూటమికి తాను మద్దత్తుని తెలియజేశానని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు తెలంగాణ కు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ వాగ్దానం చేశారు అని ఆయన గుర్తు చేశారు. మరి ఎందుకు చేయలేదు కారణం చెప్పాలి అని పవన్ ప్రశ్నించారు. దేశానికి చాయ్ వాలా ప్రధాని అయినప్పుడూ నిత్యం సామాజిక సమస్యలపై పోరాడే మాయావతి ఎందుకు ప్రధాని అవ్వొద్దు అని ఆయన అన్నారు దేశానికి మాయావతి లాంటి నేత అవసరం ఉందని ఆయన తెలియజేశారు.