టీడీపీ నేతలపై పగ..! వదలని ఐటీ సెగ..! ఈసారి పుట్టా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీ లో టీడీపీ నేతలపై ఐటీ అధికారులు బుసలు కొడుతున్నారు. ఇప్పటికే కనిగిరి అభ్యర్థి ఉగ్రనరసింహా రెడ్డి నివాసంలో ఆయన విద్యాసంస్థలు అమరావతి మెడికల్ కాలేజ్ లో ఐటీ దాడులు జరిగాయి. ఇక అంతకుముందు మంత్రి నారాయణ నివాసం లోనూ నారాయణ మెడికల్ కాలేజీ లోనూ ఐటీ సోదాలు జరిగాయి.. ఇద్దరు నేతల మీద ఇప్పటికే సోదాలు నిర్వహించగా ఇప్పుడు తాజాగా మైదాకురు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రొద్దుటూరులోని పుట్టా సుధాకర్ నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు చేయగా అక్కడ భారీగా డబ్బు దొరికానట్టు సమాచారం.

ఎన్నికలకీ పట్టుమంటూ పాధి రోజులు కూడా లేవు ఇలాంటి పరిస్తితితులలో ఇలా ఐటీ దాడులు చేయించి తమ ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీయాలని ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. మరికొందరు నేతలపైనా దాడులు జరిగే అవకాశముందని టీడీపీ భావిస్తోంది. ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు, విశాఖపట్టణం జిల్లాలకు చెందిన నేతలను టార్గెట్‌చేస్తారని భావిస్తోంది. కేవలం మన రాష్ట్రం లోనే కాకుండా కేంద్రం ఇదే తరహాలో కర్నాటక లో తమిళనాడు లో కూడా ఇలాగే దాడులు నిర్వహించింది. ఎన్నికల్లో ప్రత్యర్ధులకి పోటీగా ప్రచారాలు చేయకుండా కేంద్రం ఈ కుట్రలకి పాల్పడుతుందని టీడీపీ వార్గాలు ఆరోపిస్తున్నాయి.

ఇకపోతే పుట్టా సుధాకర్ యాదవ్ ఈ దాడులపై స్పందిస్తూ.. నాపై ఐటీ దాడులు ప్రత్యర్థుల కుట్రే. నాపై గెలవలేమన్న భయంతోనే ఐటీతో దాడులు చేయిస్తున్నారు. చట్టానికి లోబడే మా కంపెనీలు పనిచేస్తున్నాయి. మాది రూ.500 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ. మేం రూపాయి కూడా అవకతవకలకు పాల్పడలేదు. ఎవ్వరికీ భయపడం అని ఆయన అంటున్నారు. ఇక ఈ నేపధ్యం లో కేంద్రానికి కూడా ఏదో ఒక రీతిలో ఇలాంటి షాక్ నే ఇవ్వాలని తగిన సమాధానం చెప్పాలని టీడీపీ నేతలు ప్లాన్ చేస్తునట్టుగా సమాచారం.

Share.

Comments are closed.

%d bloggers like this: