వైసీపీ కార్యకర్తలు చెప్పులు..రాళ్ళు..! జవాన్లు లాఠీలు..! గందరగోళం.

Google+ Pinterest LinkedIn Tumblr +

బుధవారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారంలో భాగంగా మైలవరంలో సభ నిర్వహించారు. సభకి భారీగా జనం తరలి వచ్చారు. సభలో జగన్ పోలీసుల పై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు.. జనం అంతా తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. జగన్ ప్రసంగించిన అనంతరం కారులో హెలిప్యాడ్ వద్దకి చేరుకున్నారు.. జగన్ తో నడవాలనే తపనతో కార్యకర్తలు హెలిప్యాడ్ కి చేరుకుంధామని పరుగులు తీశారు. దీంతో అక్కడ బందోబస్తు చేస్తున్న సీ‌ఐ‌ఎస్‌ఎఫ్ జవాన్లు వైసీపీ కార్య్కర్తలని అడ్డగించారు. జవాన్లను తోస్తూ జనం ఎగబడేసరికి జవాన్లు లాటిలు చూపించి అడ్డగించారు. ఇక జవాన్లకి వైసీపీ కార్యకర్తలకి మద్య వాగ్వాదం ఏర్పడింది.

ఆ వాగ్వాదం కాస్త తోపులాటకి దారి తీసింది.. జవాన్ల మీద జనం ఒక్కసారిగా ఎగబడేసరికి జవాన్లు లాతిచార్జ్ చేశారు. దొరికిన వారిని దొరికినట్టుగా లాటి తో బాదారు.. వైసీపీ కార్యకర్తలు పరుగులు తీసి వేదిక వెనక వైపునుండి జవాన్లపైకి చొప్పులు రాళ్ళు విసిరారు.. తీవ్ర గందరగోళ పరిస్తితి నెలకొంది.. ఒక్కోసారిగా కార్యకర్తల సంఖ్య వెలకి చేరుకుంది జవాన్లపై తిరగబడ్డారు. జవాన్లపైకి పరుగులు తీయడం తో జవాన్లు అక్కడనుండు పరుగులు తీస్తూ దేగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు.. ఇక పోలీసులు రంగం లోకి దిగినప్పదికీ పరిస్తితి సద్దుమనగలేదు పోలీస్ స్టేషన్ పైకి కూడా రాలు విసిరి వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇక అక్కడి స్థానికీ వైసీపీ అభ్యర్థి కృష్ణప్రసాద్‌, ఇతర నేతలతో హుటాహుటిన స్టేషన్‌కు చేరుకుని ఆందోళన చేస్తున్న తమ కార్యకర్తలను వెనక్కు తీసుకెళ్లారు. కాసేపటికి వివాదం సద్దుమణిగింది. దీనిపై నూజివీడు డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ కాన్వాయ్‌కి అనుమతించిన మార్గంలో కాకుండా వేరే దారిలో సభా వేదికకు వచ్చిందని తెలిపారు. వేదిక వెనుక లారీని పెట్టడంతో ఆయన మార్గాన్ని మార్చినట్లు పొరపడ్డారన్నారు. తాము నిబంధనల మేరకే పని చేస్తున్నామని, ఈ ఘటన చాలా దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: