టీడీపీ ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో మాట్లాడినా ఆయన ప్రతి పక్ష నేత వైఎస్ జగన్ పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై అలాగే దేశ ప్రధాని మోడి పై వ్యంగ్యంగా విమర్శలు చేశారు. వారంతా కలిసి కుట్రలు చేస్తున్నారని వారి కుట్రలు జనం చూస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వారే సరైన సమాధానం చెబుతారనై ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా జగన్ కెసిఆర్ ఏపి ఐ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
ఆయన మాట్లాడుతూ.. జగన్ కుటుంబ సభ్యులు ఒక్క అవకాశం ఇవ్వమని ప్రాదేయపడటం విడ్డూరంగా ఉంది. జగన్ కు ఓటేస్తే ప్రజలు కరెంట్ తీగ పట్టకున్నట్లే.. అని ఆయన వ్యంగ్యంగా మొదలు పెట్టారు. మోదీ కాబోయే ప్రధాని అనడంతో వారి మద్య ఉన్న బంధం బయటపడింది అని బుడ్డా అన్నారు. జగన్ ఓదార్పు యాత్రకి తెలంగాణ కి వెళితే కేసిఆర్ తరిమి కొట్టించాడు. తెలంగాణలో ఉన్న జగన్ ఆస్తులు కాపాడుకునేందు కేసిఆర్ చెప్పినట్లు ఆడుతున్నాడు. జగన్ పార్టీని కేసిఆర్ కి దత్తత ఇచ్చి ఆయన చెప్పినట్లు ఆడుతున్నాడు అని కేసీఆర్ జగన్ లపై మండి పడ్డారు. మాయల పకీర్ ప్రాణాలు చిలకలో ఉన్నట్లు జగన్ ఆస్తులు కేసిఆర్ గుప్పెట్లో ఉన్నాయి అంటూ వ్యంగ్యంగా విమర్శలు చేశారు.
తెలంగాణ ప్రజల ఆస్తులను సంక్షేమానికి వాడాల్సింది పోయి దత్త పుత్రుడు జగన్ కు కేసిఆర్ దారాదత్తం చేస్తున్నాడు అని ఆయన కేసీఆర్ పై విమర్శలు చేశారు. ఇక తాజాగా జరిగిన ఐటీ దాడులపై ఆయన స్పందిస్తూ.. సుధాకర్ యాదవ్ ఇంటిపై రైడ్ జరిగింది.. టిడిపి వారే టార్గెట్ గా దాడులు చేయిస్తున్నారు. వైసిపి నాయకులపై ఎటువంటి దాడులు జరగవు. జగన్ చెప్పిన వారిపై మోదీ దాడులు చేయిస్తున్నారు అని ఆయన అన్నారు. ఇక మోదీ పై నిప్పులు చెరిగారు బుద్ధా.. మోదీ వ్యవహారంతో వ్యవస్ధలపై నమ్మకం పోతుంది. దేశం మొత్తం ఎన్నికలు జరుగుతున్నా ప్రధాని మోదీ చూపు మాత్రం చంద్రబాబుపైనే ఉంది. మోదీ లాంటి వ్యక్తి ప్రధానిగా ఉండటం సిగ్గుచేటు. బీజేపీ అంటే ఎల్.కె అద్వానీ, అలాంటి నాయకుడిని ఇంట్లో కూర్చోబెట్టిన నాయకుడు మోదీ. రాష్ట్రంలో మోదీ చేసే కుట్రలు దేశం మొత్తం చూస్తున్నారు అంటూ ఆయన విరుచుకపడ్డాడు.