ఎన్నికలు దేగ్గర పడుతున్నా కొద్ది నేతలు ప్రచారల్లో స్పీడ్ పెంచుతున్నారు. తమకి తెలిసిన వారిని తమ సన్నిహితులని సినీ యాక్టర్లని ఇక వారికి వీలైన వారందరినీ తమ తరఫున ప్రచారం చేయాలంటూ కోరుతున్నారు. ఇక ఎన్నికల్లో ఈ నేతల స్పీడ్ పెంచడానికి అక్కడి కార్యకర్తల జోష్ పెంచడానికి పరిచయస్తులంతా దిగోస్తున్నారు. ఈ నేపధ్యంలో సినీ నటుడు హీరో నిఖిల్ టీడీపీ డోన్ అభ్యర్థి కేయి ప్రతాప్ తరఫున ప్రచారం లో పాల్గొన్నారుఅక్కడ ఆయన మాట్లాడి కార్యకర్తల్లో జోష్ పెంచాడు. ఇక ఆయనని చూడటానికి ఆయన అభిమానులు అక్కడికి తరలి వచ్చారు.
నిఖిల్ మాట్లాడుతూ.. నేను ఈరోజు ఇక్కడికి హీరో లా రాలేదు మీ అందరి కుటుంబ సభ్యుడిలా వచ్చాను.. మన పార్టీ ని మన ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించుకోడానికి మీ అందరినీ అడగటానికి వచ్చాను అని అన్నారు. నాకు కేఈ ప్రతాప్ గారు మంచి సన్నిహితుడు దాదాపుగా 5 ఏళ్ల నుండి తెలుసు ఆయన ఇక్కడ చాలా అభివృద్ది చేశాడు.. ఈ రోడ్లని చూస్తుంటేనే తెలుస్తుంది ఆయన ఎంత కృషి చేశారో.. నేను రిల్ హీరో అయితే కేఈ ప్రతాప్ గారు రియల్ హీరో అని ఆయ్న అన్నారు.. ఈసారి అందరి ఓటుని వినియోగించుకోండి.. మన ప్రభుత్వాన్ని మళ్ళీ మనం అనాదరం కలిసి గెలిపించుకుందాం.. ప్రతాప్ గెలుపు తరువాత మళ్ళీ ఇక్కడికి వస్తాను అని ఆయన అన్నారు.
నేను రీల్ హీరో.. కేఈ ప్రతాప్ రియల్ హీరో- నిఖిల్
Share.