ప్రతిపక్షాలు రాక్షసులుగా మారి అడ్డుపడుతున్నారు..!- బాబు

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నికల దేగ్గరపడుతున్నాయి టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమయం వృధా చేయకుండా అహర్నిశలా కష్టపడుతున్నారు. రోజుకి మూడు నాలుగు జిల్లాలోని బహిరంగ సభలే కాకుండా రెండు మూడు రోడ్ షో లలో బాబు పాల్గొంటున్నారు. ఈక్రమం లో ఆయన గిద్దలూరు లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. సభలో చంద్రబాబు పోలవరం, వెలిగొండ ప్రాజెక్ట్‌ల గురించి గోదావరి జలాల గురించి భద్రాచలం గురించి ప్రస్తావించారు.

ఆయన మాట్లాడుతూ.. భద్రాచలం మునిగిపోతుందని కారణం చెప్పి పోలవరం ప్రాజెక్ట్ ని కేసీఆర్ అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. భద్రాచలం కూడా తామే తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. నేనొకపక్క రాష్ట్ర అభివృద్ది గురించి ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తుంటే.. ప్రతిపక్షంలో ఉన్న జగన్ కేసీఆర్ పట్టాన చేరి రాక్షసుడిలా మారి అడ్డగిస్తున్నాడు. ప్రాజెక్ట్ పనులన్నీ త్వరగా పోర్తి చేయడానికి వీలు లేకుండా అడ్డుపడుతున్నారు అని ఆయన అన్నారు.

వెలిగొండ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు సహా అనేక నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తన సొంత నియోజకవర్గమైన కుప్పం కంటే ముందుగా పులివెందులకు సాగునీరు అందించామని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్రమోదీ బెదిరింపులకు తాను భయపడబోనని చంద్రబాబు అన్నారు. తమ పార్టీ అభ్యర్థులను భయపెట్టే విధంగా ఐటీ దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Share.

Comments are closed.

%d bloggers like this: