భారత దేశ సినీ చరిత్రలోనే ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా రూ. 1000 కోట్లతో భారీగా ‘మహాభారతం’ సినిమాని నిర్మిస్తునట్టుగా ప్రకటన చేశారు అమెరికాకు చెందిన వ్యాపారవేత్త బీఆర్ శెట్టి. మూడేళ్ళ క్రితం బీఆర్ శెట్టి ఈ సినిమాని నిర్మిస్తునట్టుగా ప్రకటన చేశారు. భీముడి పాత్రకి మోహన్ లాల్ ని ఎంచుకునట్టు భీముడి పాత్రని ముఖ్య రోల్ గా చూపిస్తూ తెరకెక్కిదామని నిశ్చయించుకున్నారు.
ఈ విషయమై చాలా రీసర్చ్ చేసి వాసుదేవన్ నాయర్ నవల ‘రందమూజం’ ఆధారంగా సినిమాని తెరకెక్కించాలని భావించారు. ఈ సినిమాని డైరెక్ట్ చేయవలసిందిగా బీఆర్ శెట్టి.. దర్శకుడు శ్రీకుమార్ మీనన్ ని కోరారు ఆయన కూడా ఒప్పుకున్నారు.. కానీ కథని సిద్ధం చేస్తున్న క్రమంలో దర్శకుడు శ్రీకుమార్ కి నావల్ రచయిత వాసుదేవన్ కి బేదాభిప్రాయాలు వచ్చాయి.
ఇక ముందే భారీ బడ్జెట్.. కథ సిద్ధం చేస్తున్న తొలి దశల్లోనే ఇలా జరగడంతో నిర్మాతకి కథ పై చిత్రా యూనిట్ పై నమ్మకం పోయింది. ఇలాంటి వివాదాలు ఉన్నప్పుడూ గొప్ప సినిమా తీయలేమని ఈ సినిమాని విరమించుకుందామని నిర్ణయించుకున్నాడు. ఇక మంచి దర్శకుడు మంచి రచయిత వస్తే తప్ప తన సినిమా చేయలేనని తన డ్రీమ్ ప్రాజెక్ట్ చేయాలంటే మంచి చిత్ర యూనిట్ కావాలని ఆయన అభిప్రాయపడుతున్నాడు, ఇక ఈ వివాదాలు విబేదాలతో పట్టలేక్కకముందే ఈ సినిమా ఆగిపోయింది.