మహబూబాబాద్ ని అందుకే జిల్లాగా మార్చా..!- కేసీఆర్

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణలో శాసనసభ ఎన్నికలు దేగ్గర పడుతున్నాయి టీఆర్ఎస్ అధినేత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారంలో జిల్లాల వారీగా సభలు ఏర్పాటు చేస్తున్నారు.. ఈ సందర్భంగా నేడు కేసీఆర్ మహబూబాబాద్ జిల్లాలో బహిరంగ సభ నిర్వహించారు సభలో ఆయన మాట్లాడుతూ.. నాయకులకంటే ప్రజలకే ఎక్కువగా అవగాహన ఉంటుంది. మీరిచ్చే తీర్పులు, నిర్ణయాలు అంత బాగుంటాయి. ప్రతి విషయాన్ని మీరు గమనిస్తున్నారు.

మహబూబాబాద్‌ను ఎందుకు జిల్లా చేయాల్సి వచ్చిందని చాలా మంది తనను అడుగుతున్నారని కేసీఆర్ అన్నారు.. ఒక్క మహబూబాబాదే కాదు.. పూర్వ వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, ములుగు, జనగామను కూడా జిల్లాగా చేసుకున్నామని.. వాటిని జిల్లాలుగా ఎందుకు చేసుకున్నామో సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ ప్రాంతాలన్నీ గిరిజనులు కేంద్రీకృతమైన ప్రాంతాలని.. వాళ్లు బాగుపడాలంటే ఏదో డంభాచారాలు కొడితే పని కాదని..గిరిజనుల బతుకుల్లో వెలుతురు రావాలంటే పరిపాలన వాళ్ల దగ్గరికే రావాలన్నారు. అందుకే నాలుగు జిల్లాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అద్భుతమైన పోరు గడ్డ మహబూబాబాద్.. మహబూబాబాద్ గడ్డకు నేను తల వంచి నమస్కారం చేస్తున్నా. అద్భుతమైన పోరు గడ్డ ఇది. ఉద్యమ సందర్భంలో ఢిల్లీలో నన్ను అడిగేవారు. కేసీఆర్ తెలంగాణ వస్తే ఏం చేస్తావు అని వివిధ రాష్ర్టాల వాళ్లు అడిగే వాళ్లు. వాళ్లందరు కూడా ఇప్పుడు వివిధ సందర్భాల్లో నన్ను కలిసినప్పుడు ఆశ్చర్యపోతున్నారు. మీరు ఇవన్నీ ఎలా చేస్తున్నారని అడుగుతున్నారు. వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు కూడా ఆశ్చర్యపోతున్నారు. తెలంగాణ సంక్షేమం కోసం ఏంచేస్తున్నామనేది దేశమంతా తెలుసు. అది చేయి ఇది చేయి అని నన్ను ఎవరూ అడగలేదు. మేం చర్చ చేసి తెలంగాణకు ఏం చేయాలో అది చేస్తున్నాం. ఎక్కడ ఎవరికి ఏది అవసరమో అది చేసుకుంటూ వెళ్తున్నాం. రైతుల రుణమాఫి కూడా మూడునాలుగు కిస్తీల్లో అమలు చేస్తాం. లక్ష రూపాయలు మాఫీ తప్పకుండా చేస్తాం. దానిపై ఏ రైతూ రందీ పడాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మహబూబాబాద్ చాలా వెనుకబడిన ప్రాంతం కాబట్టి.. త్వరలోనే ఇక్కడికి మెడికల్ కాలేజీ కూడా రాబోతుంది. ఇక్కడ తాగునీరు, సాగునీరుకు చాలా సమస్య ఉంది. 98 శాతం మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సమస్య త్వరలోనే పూర్తవుతుంది. కరెంట్ బాధ పోయింది. రైతులకు గిట్టుబాటు ధర రావాలన్నా రాష్ట్రమంతా పంటకాలనీలుగా విభజించుకోవాలి. ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర వస్తది. సాగునీరు సమస్య కూడా త్వరలో తీరబోతోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: