అడ్డం ఆరు..! నిలువు ఆరు..! మధ్యలో బాక్సులు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నిజామాబాద్ జిల్లాలో ఈసారి ఎన్నికలు వింతగా విచిత్రంగా ఉన్నాయి..! అక్కడనుండి అధికార టీఆర్ఎస్ పార్టీ నుండి కవిత ఎంపీగా ఉన్నారు. అయితే సాధారణంగా ఏ నియోజకవర్గం నుండైనా మహా అయితే 20 మండి అభ్యర్థులు పోటీ చేస్తారు.. కానీ నిజామాబాద్ నియోజకవర్గం నుండి ఏకంగా 185 మంది బరిలో ఉన్నారు.. ప్రభుత్వం పై వ్యతిరేకతను అక్కడి రైతులు అనూహ్యంగ తెలియజేయాలని ఇలా నామినేషన్లు వేశారు. దేశంలో మరెక్కడా ఇలాంటి పరిస్తితి లేదు దేశంలో అత్యాదిక అభ్యర్తులు కలిగిన నియోజకవర్గంగా నిజామాబాద్ రికార్డ్ సృష్టించింది..

ఇలా ఒకేసారి 185 మంది పోటీలో దిగడంతో అక్కడి పార్టీ వర్గాలకి జనాలకే కాకా ఎన్నికల అధికారులకి కూడా తికమకగా ఉంది. వాళ్ళకి ఈ‌వీఎంలు ఏర్పాటు చేయడంలో బ్యాలెట్ బాక్సులు సర్దుబాటు చేయడంలో ఎలాంటి అవకతవక జరగకుండా చూసుకోడంలో ప్రతీ దానిలో టాస్కే.. అని చెప్పాలి. అయితే నిజామాబాద్ లో ఎన్నికల నిర్వాహకం లో అధికారులు తగిన కసరత్తులు చేసి ఒక నిర్ణయానికి వచ్చారు.. ఇక్కడ పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేంగా ఈవీఎంలను ఏర్పాటు చేస్తున్నారు. అడ్డం 6. నిలువు ఆరు చొప్పున ఎల్ ఆకారాంలో బ్యాలెట్‌ యూనిట్ లని ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నారు.

అడ్డం, నిలువుగా ఉన్న బ్యాలెట్ యూనిట్ల మధ్య వీవీప్యాట్‌లను అమర్చనున్నారు. దీంతోపాటు బ్యాలెట్ యూనిట్లకు వరుస క్రమంలో నెంబర్లను కేటాయించనున్నారు. ముందుగా జాతీయ పార్టీ, తర్వాత ప్రాంతీయ పార్టీ ఆ తర్వాత స్వతంత్రులుగా పోటీ చేసే అభ్యర్థులకు అక్షర క్రమంలో గుర్తులు కేటాయిస్తారు. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన గుర్తులు బ్యాలెట్ యూనిట్-1లో ఉండనున్నాయి. అలాగే అభ్యర్థి గుర్తు ఏ బ్యాలెట్ యూనిట్‌లో ఉంటుందనే విషయాన్ని పోలింగ్ స్టేషన్ ముందు ప్రదర్శించే విధంగా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. . నియోజకవర్గపరిధిలో మొత్తం 1788 పోలింగ్ స్టేషన్లలో 27,185 బ్యాలెట్ యూనిట్లు, 530 కంట్రోల్ యూనిట్లు, 3651 వీవీప్యాట్లను ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Share.

Comments are closed.

%d bloggers like this: